వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2019: నాగర్‌కర్నూల్ నుండే నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నేతల చూపు

2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నాగర్‌కర్నూల్: 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్నట్టు మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి ప్రకటించారు. అయితే గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగిన నాగం జనార్థన్‌రెడ్డి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈ దఫా నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి దిగుతున్నారు. మరో వైపు నాగం జనార్థన్‌రెడ్డి బిజెపిని వీడుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని నాగం ఖండించారు. అయితే నాగం జనార్థన్‌రెడ్డి లాంటి నేతల కోసం చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వల వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం సాగుతోంది.

Recommended Video

2019 Assembly Elections : TRS Tickets సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కుతాయా ? | Oneindia Telugu

బిజెపిలోనే ఉంటా, నాగర్‌కర్నూల్ నుండి పోటీ చేస్తా: నాగంబిజెపిలోనే ఉంటా, నాగర్‌కర్నూల్ నుండి పోటీ చేస్తా: నాగం

2019 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఎన్నికలకు పార్టీలు ఇప్పటినుండే తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. గత ఎన్నికల నాటికి ప్రస్తుత పరిస్థితులకుమధ్య చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.

చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్

విపక్షాలను అధికార టిఆర్ఎస్ బలహీనం చేసే వ్యూహన్ని ఈ మూడేళ్ళ కాలంలో అనుసరించింది. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను, బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనించింది. అయితే టిడిపి నుండి రేవంత్ రెడ్డి సుమారు 16 మంది కీలకమైన నేతలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి రాజకీయంగా కలిసివచ్చింది.

'జయలలితకు పట్టిన గతే కెసిఆర్ కు, 20 నెలలపాటు ప్రభుత్వం కాపాడుకొంటే గొప్పే''జయలలితకు పట్టిన గతే కెసిఆర్ కు, 20 నెలలపాటు ప్రభుత్వం కాపాడుకొంటే గొప్పే'

 నాగర్‌కర్నూల్ నుండి నాగం

నాగర్‌కర్నూల్ నుండి నాగం

నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి , సీనియర్ బిజెపి నేత నాగం జనార్థన్‌రెడ్డి రంగం సిద్దం చేసుకొంటున్నారు. 2014 ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి నాగం తనయుడు ఈ స్థానం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో నాగం జనార్థన్ రెడ్డి నాగర్‌కర్నూల్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాగం జనార్తన్ రెడ్డి బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని నాగం జనార్థన్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. అయితే టిఆర్ఎస్‌ను ఢీకొట్టే బలమైన నేతల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు నాగం‌ జనార్ధన్ రెడ్డి లాంటి నేతలతో కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్‌లో భాగంగానే ఈ ప్రచారం తెరమీదికి వచ్చిందని నాగం జనార్థన్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు.

 మర్రి జనార్థన్‌రెడ్డిపై పోటీ

మర్రి జనార్థన్‌రెడ్డిపై పోటీ

2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా నాగం జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టిడిపి నుండి విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి, తెలంగాణ అంశంపై పార్టీతో విభేదించారు. దీంతో ఆయన టిడిపికి రాజీనామా చేశారు. అంతేకాదు టిడిపి ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి కూడ పట్టుబట్టి రాజీనామాను ఆమోదింపజేసుకొన్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో నాగం జనార్థన్‌రెడ్డిపై టిడిపి అభ్యర్థిగా మర్రి జనార్తన్‌రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మర్రి జనార్ధన్‌రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.నాగం జనార్ధన్ రెడ్డి బిజెపిలో చేరారు. 2014 ఎన్నికల్లో నాగం జనార్ధన్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయితే మరోసారి నాగర్‌కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి నాగం జనార్థన్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమౌతున్నారు.

 బలమైన నేతల కోసం కాంగ్రెస్ వల

బలమైన నేతల కోసం కాంగ్రెస్ వల

టిఆర్ఎస్‌తో పాటు ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతల కోసం కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌తో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం కన్పిస్తోంది. టిఆర్ఎస్‌ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న నేతలతో కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్ట ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో అందరికీ న్యాయం చేసే పరిస్థితి మాత్రం టిఆర్ఎస్ నాయకత్వానికి ఉండదు. అసంతృప్తులు తమకు పనిచేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మరో వైపు ఎన్నికల నాటికే ఇతర పార్టీల్లోని బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

 నాగర్‌కర్నూల్‌లో 30 ఏళ్ళుగా నాగం హవా

నాగర్‌కర్నూల్‌లో 30 ఏళ్ళుగా నాగం హవా

నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 6 దఫాలు నాగం జనార్ధన్‌రెడ్డి ఈ స్థానం నుండి విజయం సాధించారు. అయితే 1983లో నాగం జనార్థన్‌రెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయం సాదించారు. 2012 లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా విజయం సాధించారు. మరోసారి 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుండి నాగం జనార్థన్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది.

English summary
With its spirit apparently soaring after defecting some TDP leaders led by A Revanth Reddy to the party-fold, the Congress is now focussing on the ruling TRS as well as BJP to poach more leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X