వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"కేసీఆర్ మాట తప్పారు.. ఆ విషయం నిరూపిస్తే రాజీనామా చేస్తా!"

ఆ పత్రికలో వచ్చిన వ్యాసం గనుక తాను రాసిందేనని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్దమేనని చిన్నారెడ్డి సవాల్ విసిరారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తాను ఏనాడు సమర్థించలేదని, ఈ ప్రాజెక్టును సమర్థిస్తూ ఓ దినపత్రికలో తన పేరిట వచ్చిన వ్యాసం తాను రాసింది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి స్పష్టం చేశారు.

ఆ పత్రికలో వచ్చిన వ్యాసం గనుక తాను రాసిందేనని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్దమేనని చిన్నారెడ్డి సవాల్ విసిరారు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి పదే పదే తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న చిన్నారెడ్డి.. పుష్కర ఘాట్ల నిర్మాణంలో ఆయన నాలుగు కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Congress Mla Chinna Reddy fires on telangana CM KCR

పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ విస్మరిస్తున్నారని, 'పాలమూరు', 'రంగారెడ్డి' ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని 27వేల నుంచి 50వేల కోట్లకు ఇష్టానుసారంగా పెంచేశారని చిన్నారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వస్తే దళితున్ని సీఎం చేస్తానన్న సీఎం కేసీఆర్ గత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ నెరవేర్చకపోతే తల నరుక్కుంటానని కేసీఆర్ అప్పట్లో చెప్పిన మాటను గుర్తు చేశారు. అధికారం రాగానే కేసీఆర్ మాట తప్పారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.'

English summary
Telangana congress MLA Chinnareddy alleged telangana govt that expenditure of irigation projects will increased too much
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X