వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారుతారా: తెరాసలో చేరిన ఎమ్మెల్యే ఏం చెప్పారంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై నల్గొండ జిల్లా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిప్పులు చెరిగారు. పార్టీలో దళితులకు సరైన గౌరవం లేదన్నారు. పీసీసీ చీఫ్ ఓ సైకో అన్నారు. రాత్రి పన్నెండు గంటల వరకు నిద్రపోడని, ఉదయం పన్నెండు గంటల వరకు లేవడని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కోటు, గెడ్డం నుంచి దుర్వాసన వస్తోందన్నారు.

<strong>అందుకే పవన్ కళ్యాణ్‌కు కేసీఆర్ దూరమా, ఆ ఆశలపై జనసేన నీళ్లు చల్లుతుందా?</strong>అందుకే పవన్ కళ్యాణ్‌కు కేసీఆర్ దూరమా, ఆ ఆశలపై జనసేన నీళ్లు చల్లుతుందా?

ఉత్తమ్ కుమార్ రెడ్డి విధానాలు నచ్చకనే తాను పార్టీ మారానని చిరుమర్తి లింగయ్య చెప్పారు. ఎవరి ప్రోద్భలంతోను తాను పార్టీ మారలేదని చెప్పారు. తాను రాజకీయంగా ఎదిగేందుకు కోమటిరెడ్డి సోదరులు తనకు ఎంతగానే సహకరించారని గుర్తు చేసుకున్నారు. వాళ్లు తెరాసలోకి వస్తారో రారో తనకు మాత్రం తెలియదని చెప్పారు.

 Congress MLA Chirumarthi Lingaiah talks about Komatireddy brothers party change on Monday.

తాను పార్టీ మారడానికి ప్రధాన కారణం ఉత్తమ్ కుమర్ రెడ్డి విధానాలు నచ్చకపోవడమే అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజల్లో అధారణ ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో టిఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ఎన్నికల్లో తన నియోజకవర్గ ప్రజలకు (నకిరేకల్) చాలా హమీలు ఇచ్చానని, వాటిని నేరవేర్చాంటే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా తెరాసలో చేరడమే కరెక్ట్ అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుతో గాంధీ భవన్‌కు వచ్చే వారే కరువైయ్యారని చెప్పారు.
రాహుల్ గాంధీ సభకు పదివేల మంది కూడా రాలేడంటే ఉత్తమ్ పని తీరు అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా తనకు చాల సహకరించారన్నారు. వాళ్లు తెరాసలోకి వస్తారో రారో తనకు తెలియదన్నారు. తాను ఎవరి ప్రోద్బలంతో పార్టీ మారడం లేదని, తన నియోజకవర్గ ప్రజల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు.

English summary
Congress MLA Chirumarthi Lingaiah talks about Komatireddy brothers party change on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X