వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడుపు చెక్కలు చేసుకున్న గండ్ర..! కార్యకర్తల సమక్షంలో కుమిలి కుమిల ఏడ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..!!

|
Google Oneindia TeluguNews

భూపాలపల్లి: భూపాలపల్లి కాంగ్రెస్ ఎంఎల్యే గండ్ర వెంకటరమాణారెడ్డి బోరున ఏడ్చారు. అదికూడా కార్యక్తల ముందు కుళ్లి కుళ్లి ఏడ్చారు. అంతమంది జనం మద్య ఎందుకు ఏడ్చావని భ్యార్య ఎక్కడ అడుగుతుందోనని భావించిన గండ్ర ఆమె సమక్షంలోనే ఏడుపు లంకించుకున్నారు. కన్నీళ్లు కట్టలు తెంచుకుని, కడుపు చెరువవుతుంటే చూస్తున్న కార్యకర్తలు కూడా కాస్త బాదపడ్డట్టు తెలుస్తోంది. ఇంతకీ గండ్ర రమణారెడ్డి ఎందుకు అంతగా బాధపడ్డారో, ఎందుకు ప్రజల సమక్షంలో ఏడ్చారో తెలిస్తే కాస్త నవ్వురాక మానదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి గులాబీ పార్టీ లోకి మారుతున్నందుకు తనకు తరకు బాధగా అనిపించి దుఖం కట్టలు తెంచుకున్నట్టు చెప్పుకొచ్చారు సదరు ఎమ్మెల్యే. మరి పార్టీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మారాల్సిన అవసరం ఎందుకు, తమ ముందు ఏడవాల్సిన అవసరం ఎందుకని కార్యకర్తలు తమలో తాము చర్చించుకున్నట్టు తెలుస్తోంది.

 బాధాతప్త హృదయంతో నిర్ణయం తీసుకున్నా..! శోకాలు పెట్టిన మాజీ మంత్రి..!!

బాధాతప్త హృదయంతో నిర్ణయం తీసుకున్నా..! శోకాలు పెట్టిన మాజీ మంత్రి..!!

నా 32 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశా.. పార్టీని వీడటం బాధగా ఉంది.. అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం బాధాతప్త హృదయంతో తీసుకున్న నిర్ణయం ఇది అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం భూపాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో తన సతీమణి జ్యోతితో కలసి కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు.

 నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీలోకి..! స్పష్టం చేసిన గండ్ర..!!

నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీలోకి..! స్పష్టం చేసిన గండ్ర..!!

ఈ సందర్భంగా గండ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రం, నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయమై తనతో పాటు తన భార్య జ్యోతి నిత్యం బాధ పడ్డామని చెప్పారు. గడిచిన నలభై రోజులుగా రోజుకు రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతూ.. అధికార పార్టీలో చేరాలా వద్దా అని ఆలోచించామని పేర్కొన్నారు.

తన మొత్తం రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదన్న గండ్ర..! అభివ్రుద్ది కోసమేనట మార్పు..!!

తన మొత్తం రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదన్న గండ్ర..! అభివ్రుద్ది కోసమేనట మార్పు..!!

చివరకు భూపాలపల్లిలో మెడికల్‌ కళాశాల, బైపాస్‌ రోడ్డు, లిఫ్ట్‌ ఇరిగేషన్, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర పనులను చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్‌ఎస్‌లో చేరానని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలు వేరైనా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, తాను అన్నదమ్ముల్లా మెదిలామని గుర్తు చేశారు.

 జనం మద్య గండ్ర దంపతుల ఏడుపు..! ఓదార్చిన కార్యకర్తలు..!!

జనం మద్య గండ్ర దంపతుల ఏడుపు..! ఓదార్చిన కార్యకర్తలు..!!

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, కేటీఆర్‌ ఆహ్వానం మేరకు.. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పారు. పార్టీ మారుతున్న సందర్భంగా కార్యకర్తలకు సమాధానం ఇచ్చే క్రమంలో బాధ పడుతున్నానని గండ్ర గద్గద స్వరంతో మాట్లాడుతుండగా ఆయన సతీమణి జ్యోతి కూడా కంటతడి పెట్టారు.

English summary
This is the decision taken by the heartfelt heart for the development of the constituency, said Bhupalapalli MLA Gundra Venkataramana Reddy.on party changing issue Gandra and his wife given explanation to his constituency cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X