వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఖాళీ అవుతోందా..? టీఆర్ఎస్ పార్టీలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. ఇప్పటికే హస్తం పార్టీకి హ్యాండిచ్చి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసేకున్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. త్వరలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలిపారు.

Congress MLA Surendar resigns to party and joins TRS

తన నియోజకవర్గం ఎల్లారెడ్డి అభివృద్ధి ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని సురేందర్ అన్నారు. నియోజక ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని సురేందర్ తెలిపారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తానని వెల్లడించారు.

సొంత గూటికి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్‌లో దశ తిరిగేనా..?సొంత గూటికి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్‌లో దశ తిరిగేనా..?

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన రైతు బంధు పథకంతో తన నియోజకవర్గంలో చాలా మంది రైతులు లబ్ధిపొందారని చెప్పిన సురేందర్.... దేశవ్యాప్తంగా ఈ పథకం ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గతంలో తనకు టీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్న జాజుల సురేందర్ కార్యకర్తల అభీష్టం మేరకే సీఎం కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల తీసుకున్న చొరవ, చిత్తశుద్ధితో చేసిన పనులు గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదని వ్యాఖ్యానించారు జాజుల సురేందర్.

English summary
In another shock to Congress, Yellareddy MLA Jajula Surendar switched over to TRS.In a letter that was relaeased by Surendar says that only KCR has all the capability to develop his constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X