టీపీసీసీ చీఫ్ పదవిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రియాక్షన్... పుట్టినరోజు నాడే అధిష్టానం కానుక..?
టీపీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ అధిష్టానం నుంచి అంతర్గత లీకులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు,ఆయన అభిమానుల కోలాహలం మొదలైంది. యాధృచ్చికంగా మంగళవారం జీవన్ రెడ్డి పుట్టినరోజు కూడా కావడంతో అభిమానులు,మద్దతుదారులు కేకులు,శాలువాలతో ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్‌గా జీవన్ రెడ్డి ఫిక్స్..? రేవంత్ రాజీ పడ్డట్టేనా.. అందుకే స్వరం మారిందా...?

జీవన్ రెడ్డి రియాక్షన్...
పీసీసీ పదవిపై ఇప్పటివరకూ అధిష్టానం నుంచి తనకెలాంటి సమాచారం అందలేదని జీవన్ రెడ్డి చెప్పారు. మీడియాలో ప్రచారమంతా ఊహాజనితమేనని అన్నారు. అయితే నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న నేతగా పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పనిచేసేందుకు సిద్దమని చెప్పారు.పీసీసీ పదవి వచ్చినా రాకపోయినా సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం తాను పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
అందాల భామ రాశీఖన్నా గ్లామరస్ ఫోటోషూట్...

పుట్టినరోజు కానుక..
పీసీసీ పదవిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ జీవన్ రెడ్డి పుట్టినరోజు కానుకగానే ఈ విషయాన్ని అధిష్టానం లీక్ చేసిందన్న ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని సందడి చేస్తున్నారు.జీవన్ రెడ్డికి టీపీసీసీ పదవిపై రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రేవంత్,కోమటిరెడ్డి పేర్లు వినిపించినా...
టీపీసీసీ పదవి కోసం మొదటి నుంచి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో రేవంత్ రెడ్డికే పీసీసీ పదవి ఖరారైందని... ఇక ప్రకటించడమే తరువాయి అన్న లీకులు వచ్చాయి. కానీ రేవంత్‌కు టీపీసీసీ పదవిపై సీనియర్ల నుంచి వ్యతిరేకత రావడంతో అధిష్టానం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రేవంత్,కోమటిరెడ్డి.. ఈ ఇద్దరికీ కాకుండా సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఆ పదవి ఇవ్వడం సముచితమని అధిష్టానం భావించినట్లు సమాచారం. ఇక ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు రేవంత్‌కు అప్పగించవచ్చునన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే పీసీసీ,ప్రచార కమిటీ ఛైర్మన్ ఈ రెండు కీలక పదవులను రెడ్డి సామాజికవర్గానికే కట్టబెడితే పార్టీ నుంచి అభ్యంతరాలు రావొచ్చునని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.