వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థుల జాబితా రెఢీ..! మ‌రో రెండు రోజుల్లో ఖ‌రారు చేయ‌నున్న రాహుల్..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : గాంధీ భ‌వ‌న్ లో లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యరుల ఎంపిక సమావేశం వాడీవేడీగా సాగింది. నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాల నడుమ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చింది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు ఇచ్చిన లోక్‌సభ అభ్యర్థుల పేర్లపై ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఒక్కో పార్లమెంటు స్థానానికి ఇద్దరి నుంచి ఐదుగురి పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా సిద్ధం చేసింది. ఈ జాబితాతో బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిల్లీ వెళ్లి ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి జాబితా అందచేస్తారు. పరిశీలన అనంతరం ఏఐసీసీ అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటిస్తుందని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

భిన్న వాద‌న‌లు వినిపించిన నాయ‌కులు..!!

భిన్న వాద‌న‌లు వినిపించిన నాయ‌కులు..!!

నేతల మధ్య వాగ్వాదం..! భిన్న వాద‌న‌లు వినిపించిన నాయ‌కులు..!!
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా, ఉత్తమ్‌, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా కొందరు పారిశ్రామికవేత్తల పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసింది.మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, భువనగిరి, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాల అభ్యర్థిత్వాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 పార్టీ బాగున్నపుడు చేసినవాళ్లు... ఇప్పుడూ చేయాలన్న డీకే అరుణ‌..!!

పార్టీ బాగున్నపుడు చేసినవాళ్లు... ఇప్పుడూ చేయాలన్న డీకే అరుణ‌..!!

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో కేంద్రమంత్రి, సీనియర్‌ నాయకుడు ఎస్‌.జైపాల్‌రెడ్డి పేరు లేకపోవడంపై మాజీ మంత్రి డి.కె.అరుణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేయాలని అరుణను కుంతియా అడగగా...పెద్దాయన ఎస్‌.జైపాల్‌రెడ్డి ఉండగా కొత్తవాళ్లు ఎందుకు అని ఆమె సమాధానం ఇచ్చారు. ఉత్తమ్‌ కల్పించుకొని జైపాల్‌రెడ్డి ఈసారి పోటీకి ఆసక్తి చూపించడం లేదని అన్నారు. అరుణ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో అంతా బాగున్నప్పుడు పోటీ చేసినవాళ్లు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పోటీ చేయాలి కదా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనవారికి టికెట్లు ఇప్పించుకున్నవారు ఇప్పుడు ఎందుకు పోటీ చేయరని అడిగారు. తనకు అసెంబ్లీ ఎన్నికల్లో భారం ఎక్కువైందని, ఇప్పుడు పోటీ చేయనని ఆమె తేల్చి చెప్పినట్లు తెలిసింది.

 ప్రతి ఎంపీ స్థానానికి తీవ్ర పోటీ..! నేడు అధిష్ఠానానికి అందించనున్న ఉత్తమ్‌..!!

ప్రతి ఎంపీ స్థానానికి తీవ్ర పోటీ..! నేడు అధిష్ఠానానికి అందించనున్న ఉత్తమ్‌..!!

నాగర్‌కర్నూల్‌ నుంచి సతీష్‌ మాదిగ పేరును అరుణ ప్రస్తావించారు. ఈవిషయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, అరుణ మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీ స్థాయి ఉన్నవాళ్లు, పాత వాళ్ల పేర్లను సూచించమని సంపత్‌ పేర్కొనగా...కొత్తగా ఎమ్మెల్యేలు అయినవారిని ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు, ఎన్నికల ముందు పార్టీలో చేరినవారికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు కదా? అని అరుణ అన్నట్లు సమాచారం. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ మధుయాస్కీ పేరును షబ్బీర్‌అలీ ప్రతిపాదించారు. తాను వేరే స్థానం నుంచి ఎందుకు చేయకూడదని ఆయన ప్రశ్నించారు. షబ్బీర్‌ ప్రతిస్పందిస్తూ.. ‘నిజామాబాద్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు అక్కడి నుంచి మీరు పోటీ చేయకపోతే ఇంకెవరు చేస్తార'ని ఎదురు ప్రశ్నించారు. ఈవిషయంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. యాస్కీ భువనగిరి స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపినపుడు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది.

 టీపిసిసి ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా..! ఖ‌రారు చేయ‌నున్న రాహుల్ గాంధీ..!!

టీపిసిసి ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా..! ఖ‌రారు చేయ‌నున్న రాహుల్ గాంధీ..!!

1. ఆదిలాబాద్‌: సోయంబాపూరావు, నరేష్‌ జాదవ్‌, రమేష్‌ రాథోడ్‌. 2. పెద్దపల్లి: కవ్వంపల్లి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్‌, జి.శ్రీనివాస్‌. 3. నిజామాబాద్‌: మధుయాస్కీ, పి.సుదర్శన్‌రెడ్డి, మహేష్‌గౌడ్‌. 4. నల్గొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పద్మావతిరెడ్డి, రఘువీర్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి. 5. భువనగిరి: మధుయాస్కీ, వంగాల స్వామిగౌడ్‌, రాపోలు జయప్రకాశ్‌, గూడూరు నారాయణరెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి. 6. మెదక్‌: నిర్మలా జగ్గారెడ్డి, అనిల్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌. 7. ఖమ్మం: రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వి.హన్మంతరావు, సంభాని చంద్రశేఖర్‌, గాయత్రి రవి. 8. కరీంనగర్‌: పొన్నం ప్రభాకర్‌, మృత్యుంజయం, ప్యాట రమేష్‌, నేరెళ్ల శారద. 9. నాగర్‌కర్నూల్‌: నంది ఎల్లయ్య (సిట్టింగ్‌ ఎంపీ), మల్లురవి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌, బొల్లు కిషన్‌, సతీష్‌ మాదిగ. 10. మల్కాజిగిరి: కూన శ్రీశైలంగౌడ్‌, కనుకుల జనార్దన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి. 11. చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి(సిట్టింగ్‌ ఎంపీ), కార్తీక్‌రెడ్డి, భిక్షపతియాదవ్‌. 12. మహబూబ్‌నగర్‌: వంశీచందర్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి. 13. జహీరాబాద్‌: మదన్‌మోహన్‌రావు, సుభాష్‌రెడ్డి, జూపాల్‌రెడ్డి(బాగారెడ్డితనయుడు). 14. సికింద్రాబాద్‌: ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, మరో ఇద్దరు. 15. వరంగల్‌: సిరిసిల్ల రాజయ్య, మందకృష్ణమాదిగ, మానవతారాయ్‌. 16. మహబూబాబాద్‌: పి.బలరాంనాయక్‌, రవీంద్రనాయక్‌, బెల్లయ్యనాయక్‌, చీమల వెంకటేశ్వర్లు. 17. హైదరాబాద్‌: అజారుద్దీన్ తో పాటు మరో ఇద్దరి పేర్ల‌ను అదిష్టానానికి పంప‌నుంది టీపీసీసీ.

English summary
At the Gandhi Bhavan, a meeting of the Lok Sabha Congress candidates was held in hot hot condition. The Congress has given a final look to the list of candidates. The Committee has long discussed the names of the Lok Sabha candidates given by the District Congress Committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X