వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గెలుపు గుర్రాలకే: రేవంత్‌రెడ్డి చేరిన వెంటనే ఉత్తమ్ మాట ఇదీ

నవంబర్ 19వ, తేదిన వరంగల్‌లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభను ఏర్పాటు చేయనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారికే టిక్కెట్లను కేటాయించనున్నట

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నవంబర్ 19వ, తేదిన వరంగల్‌లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభను ఏర్పాటు చేయనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారికే టిక్కెట్లను కేటాయించనున్నట్టు ఉత్తమ్‌ ప్రకటించారు.రేవంత్‌రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

రేవంత్‌రెడ్డితో పాటు ఆయన వెంట పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో మంగళవారం నాడు ఢిల్లీలో చేరారు. అదే సమయంలో వరంగల్ సభ గురించి రాహుల్‌తో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చించారు.

వరంగల్‌లో జరిగే సభకు భారీగా జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ సభను వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్‌లో ఈ సభను ఏర్పాటు చేశారు.

గెలిచేవారికే టిక్కెట్లు

గెలిచేవారికే టిక్కెట్లు

2019 ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికీ ఏ అసెంబ్లీ స్థానంలో టిక్కెట్లు కేటాయించాలనే విషయమై సర్వేలు నిర్వహించనుంది. ఈ సర్వేల ఆధారంగానే 2019 ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్లను కేటాయించనున్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. నవంబర్ మాసం నుండి సర్వేలను నిర్వహించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.రేవంత్‌ వెంట కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలంతా ఉత్తమ్ వ్యాఖ్యలతో ఖంగుతిన్నారు. సర్వేల ఆదారంగా టిక్కెట్లను కేటాయించనున్నట్టు చెప్పడం వారిలో కొంత నిరాశను కల్గించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ

సామాజిక న్యాయం ఆధారంగా టిక్కెట్లు

సామాజిక న్యాయం ఆధారంగా టిక్కెట్లు

సామాజిక న్యాయాన్ని కూడ దృష్టిలో ఉంచుకొని టిక్కెట్లను కేటాయించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది.అన్ని వర్గాలకు కూడ టిక్కెట్ల కేటాయింపులో న్యాయం జరిగేలా కసరత్తు చేస్తామని పీసీపీ చీఫ్ ఉత్తమ్ చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో చోటుచేసుకొన్న పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటామని ప్రకటించింది.

రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''

వరంగల్‌లో రాహుల్ సభ

వరంగల్‌లో రాహుల్ సభ

నవంబర్ 19న, వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభను నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సభను ఏర్పాటుచేశారు.
రేవంత్‌రెడ్డి తన అనుచరులతో రాహుల్ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమయంలో వరంగల్ సభ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహ పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో వరంగల్ సభ విషయమై చర్చించారు. వరంగల్‌ సభలో ప్రస్తావించాల్సిన అంశాలు, జన సమీకరణ తదితర అంశాలపై పార్టీనేతలు రాహుల్‌తో చర్చించారు.రేవంత్ నుండి టిడిపి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినందున ఈ సభను రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం చేసేందుకు కృషిచేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.

ఢిల్లీకి రేవంత్‌: 2019లో పోటీ చేసే వారంతా అక్కడే, టిక్కెట్లకోసం రాహుల్‌ హమీ? ఢిల్లీకి రేవంత్‌: 2019లో పోటీ చేసే వారంతా అక్కడే, టిక్కెట్లకోసం రాహుల్‌ హమీ?

పార్టీ పదవులు

పార్టీ పదవులు

2019 ఎన్నికల్లో టిక్కెట్లు దక్కనివారికి పార్టీ పదవులతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇతర పదవులను ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.అయితే టిక్కెట్లు కేటాయించినా గెలిచే సత్తా లేనివారికి టిక్కెట్లు ఇవ్వడం వల్ల టిఆర్ఎస్‌కు పరోక్షంగా ప్రయోజనం కలిగించినవారయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

టిఆర్ఎస్‌తో సంప్రదింపులు చేశాకే!: 'వారంతా కాంగ్రెస్‌లోకి'టిఆర్ఎస్‌తో సంప్రదింపులు చేశాకే!: 'వారంతా కాంగ్రెస్‌లోకి'

English summary
Congress party will conduct a Rahulgandhi meeting on November 19 at Warangal.Tpcc chief Uttam Kumar reddy announced this meeting at Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X