వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓట‌మిని జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్..! తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటున్న‌ పొన్నాల..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ponnala Demanding To Repoll In Telangana | Oneindia Telugu

హైదరాబాద్ : ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎదురైన ఓట‌మిని కాంగ్రెస్ పార్టీ అంతాగా జీర్ణించుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈవీయంలో త‌లెత్తిన సాంకేతిక లోపాలు అదికార గులాబీ పార్టీకి క‌లిసొచ్చింద‌ని ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు కొంద‌రు ఆరోపిస్తుండ‌గా, వీవీ ప్యాట్ ల‌లోని స్లిప్పుల‌ను లెక్కిస్తే అస‌లు విష‌యం తెలిసిపోంతుంద‌ని స్వ‌యంగా టీపిసిసి ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డే డిమాండ్ చేస్తున్నారు.

అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో నేత పొన్నం ప్ర‌భాక‌ర్ అదికార పార్టీ ఎన్నిక‌ల త‌తంగాన్ని హైజాక్ చేసింద‌ని ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ అదికార దుర్వినియోగానికి పాల్ప‌డ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఓట‌మిపాల‌య్యింద‌ని చెప్పుకొస్తున్నారు. డ‌బ్బు, మ‌ద్యం య‌దేఛ్చ‌గా ప్ర‌జ‌ల‌కు ఎర వేయ‌డ‌మే కాకుండా ఎన్నిక‌ల యంత్రాగాన్ని కూడా అదికార పార్టీ ప్ర‌భావితం చేసిద‌ని మ‌రికొంత మంది కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

congress party couldnt digest the defeat...! Ponnala demanding to re-poll in telangana..!!

కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో సీనియ‌ర్ పొన్నాల ల‌క్ష్మ‌య్య కొత్త డిమాండ్ ను తెర‌పైకి తెచ్చారు. తెలంగాణ లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో గోల్ మాల్ జ‌రిగింద‌ని, అస‌లు ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎన్నిక‌ల క‌మీష‌న్ త‌ప్పులు కూడా ఉన్న‌యాని తెలిపారు.

అందుకోసం తెలంగాణలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరపాలని కోరారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల అధికారి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటు అని తప్పుపట్టారు.

English summary
The defeat in the early elections is not digesting the Congress party leaders. While some of those party chiefs allege that the technical disadvantages in this event were mingled with the trs party, TPCC Chief Uttam Kumar Reddy is demanding that he will know the details of the slips in the VVV pats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X