హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశ్వ నగరమంటే ఇదేనా?: టిఆర్ఎస్‌పై కుంతియా ఫైర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విశ్వనగరమంటే ఒక్క చినుకు పడితే నగరమంతా నదిలా ఉంటుందా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జీ ఆర్‌సీ కుంతియా విమర్శించారు తెరాస ప్రభుత్వ వైఫల్యంతో హైదరాబాద్‌ నగర పరిస్థితి దిగజారుతోందని ఆయన అనయనారు.

నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కుంతియా చెప్పారు. ఇటీవల వర్షానికి దెబ్బతిన్న బంజారాహిల్స్‌ నాయుడునగర్‌ ప్రాంతాన్ని బుధవారంనాడు కుంతియా కాంగ్రెస్‌ నేతలతో కలిసి పరిశీలించారు.

Congress party incharge Kuntia slams Telangana government

వర్షంతో గుడిసెలు కోల్పోయిన వారికి రూ.5 లక్షలు, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కుంతియా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాధితులు నివాసం ఉండే ప్రాంతాల్లోనే రెండు పడకగదుల నివాసాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతిచెందిన కుటుంబాలకు దానం నాగేందర్‌ రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నకాలంలో హైద్రాబాద్‌ను అభివృద్ది చేసిన విషయాన్ని కుంతియా గుర్తుచేశారు. కానీ, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైద్రాబాద్‌ను సర్వనాశనం చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

English summary
Telangana Congress party incharge kuntia made allegations on Trs government. Kuntia visited rain affected places in Banjara Hills on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X