వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రేస్ పార్టీ రేవంత్ రెడ్డిని అందుకే దూరం పెట్టిందా ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

అధికార పార్టీకి ధీటైన స‌మాధానం ఇచ్చినందుకేనా??

తెలంగాణ కాంగ్రేస్ పార్టీలో విభాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి స‌రైన గుర్తింపు ఇవ్వ‌క పోగా మూడ‌వ విడ‌త త‌ల‌పెట్టిన బ‌స్సు యాత్ర‌కు స‌రైన ఆహ్వానం పంప‌లేదు రాష్ట్ర నాయ‌కత్వం. దీంతో బ‌స్సు యాత్ర‌కు దూరంగా ఉండాల‌ని రేవంత్ నిర్ణ‌యించుకున్నారు. కావాల‌నే కాంగ్రేస్ పార్టీ రేవంత్ రెడ్డిని దూరం పెడుతుంద‌నే చ‌ర్చ‌కూడా జ‌రుగుతోంది.

కేంగ్రేస్ లో కీల‌క నేత‌గా అవ‌త‌రించ‌డం ఖాయం..

కేంగ్రేస్ లో కీల‌క నేత‌గా అవ‌త‌రించ‌డం ఖాయం..

తెలుగుదేశం పార్టీ లో కీల‌క నేత‌గా ఎదిగిన రేవంత్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ కండువా క‌ప్పుకున్న త‌ర్వాత ఆ పార్టీలో అంత‌గా ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేదనే చ‌ర్చ తారాస్థాయిలో జ‌రుగుతోంది. అస‌లు కంగ్రేస్ పార్టీలో రేవంత్ చేరే అంశాన్నే కొంత మంది నేత‌లు మొద‌ట్టో వ్య‌తిరేకించిన‌ట్టుగా ఆ మ‌ద్య ప్ర‌చారం కూడా జ‌రిగింది. కాంగ్రేస్ పార్టీలో చేరేముందే రేవంత్ రెడ్డి ముఖ్య నేత‌లను వ్య‌క్తిగ‌తంగా సంప్ర‌దించి తాను ఎందుకు కాంగ్రేస్ లో చేరుతున్నాడో వివ‌రించిన‌ట్టుగా కూడా తెలుస్తోంది. అంత‌ర్గ‌త విభేదాలు త‌లెత్తకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. పార్టీలో చేరిన త‌ర్వాత త‌ల‌పెట్టిన మొద‌టి బ‌స్సు యాత్ర‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కి తెలంగాణా వ్యాప్తంగా ప్ర‌జ‌లనుండి పెద్ద యెత్తున స్పంద‌న ల‌భించింది. రేవంత్ రెడ్డి ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు ప్ర‌జ‌లు కేరింత‌లు కొట్టారు. రేవంత్ రెడ్డి ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే ప్ర‌జలు వెళ్లిపోవ‌డం కూడా జ‌రిగేది. వేదిక‌నుంచి ప్ర‌జ‌లు వెళ్లి పోవ‌ద్దని ఎన్ని విజ్ఞ‌ప్తులు చేసినా వినిపించుకునే వారు కాదు. దీంతో రేవంత్ రెడ్డి ఉప‌న్యాసాల‌ను స‌మావేశాల చివ‌రలో ఇవ్వాల‌ని కాంగ్రేస్ పార్టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. రేవంత్ రెడ్డి పేరు చెబితే ప్ర‌జల్లో మంచి స్పంద‌న వ‌స్తున్నంత వ‌ర‌కు బాగానే ఉంది గాని రేవంత్ ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే ప్ర‌జ‌లు వెళ్లిపోవ‌డాన్ని మాత్రం కాంగ్రేస్ నాయ‌కులు జీర్నించుకోలేపోతున్నారు.

రేవంత్ వ‌ల్ల బ‌స్సు యాత్ర‌లు విజ‌య‌వంతం

రేవంత్ వ‌ల్ల బ‌స్సు యాత్ర‌లు విజ‌య‌వంతం

మొద‌టి విడ‌త బ‌స్సు యాత్ర‌లో భాగంగా ఫిబ్ర‌వరి 26న చేవెళ్ల నుండి ప్రారంభ‌మైన యాత్ర మార్చ్ 12న భూపాల‌ప‌ల్లి లో ముగిసింది. చేవెళ్ల‌, వికారాబాద్, తాండూరు, సంగారెడ్డి, క‌రీంన‌గ‌ర్, మంథ‌ని, త‌దిత‌ర ప్రాంతాల్లో రేవంత్ పాల్గొన్న బ‌హిరంగా స‌భ‌ల‌కు జ‌నం పెద్ద‌యెత్తున పోటెత్తారు. ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీ నుండి రామ‌గుండం నుండి ప్రారంభ‌మైన రెండవ విడ‌త బ‌స్సుయాత్ర‌లో కూడా రేవంత్ రెడ్డే కీల‌క నేత‌గా మారారు.

బ‌హిరంగ‌స‌భ‌ల‌కు రేవంత్ హాజ‌రౌతున్నారంటే జ‌నాలు పెద్ద‌యెత్తున పాల్గొన‌డం, అనివార్య కార‌ణాల‌వ‌ల్ల రేవంత్ రెడ్డి పాల్లొన‌డం లేదంటే కార్య‌కర్త‌లు డీలా ప‌డిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది. స్థానిక నేత‌ల‌ను కాద‌ని రేవంత్ రెడ్డికి ప్ర‌జ‌లు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న అంశం బ‌స్సుయాత్ర‌ల ద్వారా రుజువైంది. తెలంగాణ కాంగ్రేస్ లో రేవంత్ రెడ్డి ట్రంప్ కార్డ్ గా మారే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని రాష్ట్ర నాయ‌క‌త్వం గ్ర‌హించింది.

దీంతో రేవంత్ రెడ్డికి మ‌రిన్ని అవ‌కాశాలు ఇచ్చి ప్రోత్స‌హించే బ‌దులు ప్రాధాన్య‌త‌లు త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు కాంగ్రేస్ సీనియ‌ర్ నేత‌లు. ఎప్ప‌టినుండో పార్టీలో ఉన్న త‌మ అవ‌కాశాల‌కు రేవంత్ ఎక్క‌డ గండి కొడ‌తాడోన‌నే సందేహంలో ప‌డిపోయారు కొంద‌రు నేత‌లు.

 రేవంత్ రెడ్డి ప్ర‌సంగాల‌కు ప్ర‌జ‌లు కేరింత‌లు

రేవంత్ రెడ్డి ప్ర‌సంగాల‌కు ప్ర‌జ‌లు కేరింత‌లు

విడ‌త బ‌స్సు యాత్ర‌కు రేవంత్ రెడ్డికి స‌రియైన ఆహ్వానం లేద‌ని చర్చ జ‌రుగుతోంది. దీంతో రేవంత్ రెడ్డి కూడా బ‌స్సు యాత్ర‌లో పాల్గొన కుండా నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కావ‌ల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎదురు లేని శ‌క్తిగా ఎదిగితే అదిష్టానం అవ‌కాశాల‌ను రేవంత్ కే ఇస్తుంద‌ని భావిస్తున్న రాష్ట్ర నేత‌లు ఆయ‌న‌ను ప‌క్క‌న పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

రేవంత్ తో పాటు చేరిన ఇత‌ర నేత‌ల‌కు కూడా స‌రైన గుర్తింపు ఇవ్వ‌డం లేద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. రేవంత్ తో పాటు పార్టీలో చేరిన నేత‌ల ప‌ద‌వుల ప‌ట్ల పీసిసి చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అదిష్టానానికి సిఫార్సు చేయ‌డంలో నాన్చుడు దోర‌ణి అవ‌లంబిస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. రేవంత్ వ‌ర్గం త‌న‌వైపు వ‌స్తే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డానికి ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

అదికార పార్టీకి ధీటైన స‌మాధానం ఇవ్వ‌డం రేవంత్ కే సాద్యం..

అదికార పార్టీకి ధీటైన స‌మాధానం ఇవ్వ‌డం రేవంత్ కే సాద్యం..

మొత్తానికి ప్ర‌జాద‌ర‌ణ మెండుగా ఉన్న రేవంత్ రెడ్డి లాంటి నేతకు ప‌ద‌వి ఇచ్చి ప్ర‌జ‌ల్లోకి పంపిస్తే పార్టీని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు పెట్టిస్తాడ‌నే అంశాన్ని ప‌క్క‌న పెట్టి సొంత పార్టీలోనే క‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సమ‌ని కార్య‌కర్త‌ల్లో పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అదికార పార్టీ విధానాల‌ను ధైర్యంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే రేవంత్ రెడ్డి లాంటి నాయ‌కుల‌ను కాంగ్రేస్ పార్టీ గుర్తించి ప్రోత్స‌హిస్తే పార్టీ మ‌నుగ‌డ‌కు ఢోకా ఉండ‌ద‌ని పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
The charming leader in congress party mr revanth reddy maintaining distance with the party. he disappointed with party leaders behavior. revanth alleged the seniors trying to keep him in the dark side. thats why he wants keep away from the 3rd time bus tour in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X