వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేతల విలీనం ఒక ముగిసిన కథ :సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

అసెంబ్లి చివరి రోజు సమావేశంలో సీఎం కేసిఆర్ కాంగ్రెస్,బీజేపీ పార్టీలపై విరుచుపడ్డారు. గత కొద్ది రోజులుగా ఆపార్టీ నేతలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. రెండు పార్టీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనని నోక్కి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే ఆర్హత లేదని స్పష్టం అన్నారు.

రాజ్యంగబద్దంగానే పార్టీలో చేరారు...

రాజ్యంగబద్దంగానే పార్టీలో చేరారు...

ఇటివల టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వందశాతం రాజ్యంగ బద్దంగానే చేరారని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల విలీనానికి సంబంధించి పలు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను ఆయన ఉదహారణలుగా చెప్పారు. అక్కడ లేని రాజ్యంగా నిబంధనలు ఇక్కడ ఎందుకు లేవదీస్తున్నారని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

గోవా, రాజస్థాన్‌లలో వీలినం మాటేమిటి...?

గోవా, రాజస్థాన్‌లలో వీలినం మాటేమిటి...?

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరడంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు దారి తీసింది. ద్రవ్యవినిమయ బిల్లుపై చివరి రోజుల చర్చల నేపథ్యంలో సీఎం కేసిఆర్ రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పారు.. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపణలపై సీఎం కేసిఆర్ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యులు రాజ్యంగబద్దంగానే పార్టీలో చేరారని అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్,బీజేపీ పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత వారం రోజుల క్రితం రాజస్తాన్‌లోని ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుందని, అంతకు ముందుకు గోవాలో కూడ ఉన్న ప్రతిపక్షనికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ప్రభుత్వం విలీనం చేసుకుందని అన్నారు.

అవసరమైతే రాజీనామ చేస్తామన్నారు

అవసరమైతే రాజీనామ చేస్తామన్నారు

ఇక పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అవసరమైతే పార్టీకి రాజీనామ చేసి టీఆర్ఎస్ పార్టీ నుండి పోటి చేస్తామని చెప్పారని అన్నారు. ఇందుకు అనుగుణంగా పన్నేండు మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ ఇచ్చారని చెప్పారు. అయితే అనర్హత పిటిషన్‌ను స్పీకర్ పట్టించుకోలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అవన్ని గాలి ఫిర్యాదులని సీఎం కేసిఆర్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల వీలిన ప్రక్రియ ఒక ముగిసిన చరిత్ర అని పేర్కోన్నారు.

English summary
Telangana CM KCR has once again made it clear that the Congress party MLAs joining in the TRS party as per constitutional rights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X