వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండు ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళితే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ప‌క్కా..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో అదికారంలోకి రావాల‌ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి గులాబీ ప్ర‌భుత్వం లోని లోపాల‌ను న‌మ్ముకుంటే స‌రిపోద‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయ‌ని గుడ్డిగా న‌మ్మితే మ‌రోసారి శ్రుంగ‌భంగం త‌ప్ప‌ద‌నే సందేహం క‌లుగుతోంది. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియ‌ని కేసీఆర్ వ్యూహాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనాలంటే రెండు అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ద్రుష్టి పెట్టాల్సి ఉంటుంద‌నే అభిప్ర‌యాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏఐసీసీ అదినేత రాహుల్ గాంధీ ఇచ్చిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లాల‌న్నా, గులాబీ ప్ర‌భుత్వం పై పైచేయి సాధించాల‌న్నా ఆ రెండు ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క్కా అమ‌లు చేయాల‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ కాంగ్రెస్ పార్టీ అమ‌లు చేయాల్సిన ఆ రెండు ప్ర‌ణాళిక‌లు ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

టీఆర్ఎస్ కి ప్ర‌త్యామ్న‌యం కాంగ్రెస్సే..! ఫైర్ ఉన్న నేత కావ‌లెను..!!

టీఆర్ఎస్ కి ప్ర‌త్యామ్న‌యం కాంగ్రెస్సే..! ఫైర్ ఉన్న నేత కావ‌లెను..!!

తెలంగాణ‌లో అదికార గులాబీ పార్టీకి ధీటుగా స‌మాధానం చెప్పే పార్టీ కాంగ్రెస్ త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీ క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేదు. గ్రామ‌గ్రామాన మంచి క్యాడ‌ర్ ఉన్న తెలుగుదేశం పార్టీ స‌రైన నాయ‌కుడు లేక చేష్ట‌లుడిగిపోయింది. వంద సునామీల బ‌లాన్నిచ్చినా తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ప్ర‌భావం చూపే ప‌రిస్థితి లేదు. ఇక కేంద్రంలో అదికారంలో ఉండి, దేశ వ్యాప్తంగా చ‌క్రం తిప్పుతున్న‌బీజేపి తెలంగాణ కు వ‌చ్చే స‌రికి చ‌క్రం తిర‌గ‌డం పూర్తిగా మొరాయిస్తుంది. దీంతో తెలంగాణ‌లో నామ‌మాత్ర‌పు పాత్ర పోషించాలి త‌ప్ప పెద్ద ప్ర‌భావం మాత్రం చూప‌దు. ఇక కాంగ్రెస్ ను మినహాయిస్తే మిగిలిన చిన్నా చిత‌కా పార్టీలైన తెలంగాణ‌ జ‌న‌స‌మితి, వైసీపి, ఎంఐఎం, వామ‌ప‌క్షాలు అంత‌గా ప్ర‌జల్లోకి వెళ్లే అవ‌కాశాలు లేవు. దీంతో అదికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మ‌ద్య‌లోనే తెలంగాణ‌లో ర‌స‌వ‌త్త‌ర‌మైన పోరు ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలోని బ‌ల‌హీన‌తలే కేసీఆర్ బ‌లం..!

కాంగ్రెస్ పార్టీలోని బ‌ల‌హీన‌తలే కేసీఆర్ బ‌లం..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఏక‌త్వంలోని భిన్న‌త్వ‌మే అదికార గులాబీ పార్టీకి ఆయుధం కాబోతోంది. పార్టీలోని వ్య‌క్తిగ‌త వైరుద్యాలు, వ‌ర్గ విభేదాలు, ప‌ర్స‌న‌ల్ ఎజెండా పార్టీ కి శ‌రాఘాతంగా ప‌రిణ‌మిస్తోంది. అవే అంశాలు కేసీఆర్ కి ప‌దునైన అస్త్రాలుగా ప‌రిణ‌మిస్తున్నాయి. కేసీఆర్ పార్టీ ప‌రంగా కొత్త ప్ర‌యోగాలు, ప్ర‌ణాళిక‌లు ర‌చించాల్సిన అవ‌స‌రం లేకుండా కాంగ్రెస్ పార్టీ లోని లోపాలే ఆయ‌న‌కు అవ‌న్నీ స‌మ‌కూరుస్తాయి. ఒక‌రంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలోని బ‌ల‌హీన‌త‌లే కేసీఆర్ కు బ‌లంగా రూపాంత‌రం చెందుతాయ‌న్న మాట‌. చంద్ర‌శేఖ‌ర్ రావు కూడా కొత్త‌గా ఏం చేయ‌బొతున్నాడో చెప్ప‌కుండా కాంగ్రెస్ పార్టీలోని బ‌ల‌హీన‌త‌ల పై ద్రుష్ట్రి కేంద్రీక‌రించి అందుకు త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతారు. దీంతో గులాబీ శ్రేణులు ఊహించిన ఫ‌లితం, కాంగ్రెస్ శ్రేణులు ఊహించ‌ని ఫ‌లితం టీఆర్ఎస్ పార్టీ కి ద‌క్క‌డం స‌హ‌జ‌సిద్దంగా జ‌రిగిపోంతుంది. ఇలాంటి సంస్ర్కుతికి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ముందున్న లక్ష్యం ఒక్క‌టే..!

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే గెలిపిస్తాయనుకుంటే పొర‌పాటే..!

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే గెలిపిస్తాయనుకుంటే పొర‌పాటే..!

తెలంగాణ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంద‌నుకోవ‌డం ఆ పార్టీ నేత‌ల అత్యాసే అనుకోవ‌చ్చు. క్షేత్ర స్థాయిలో ప్ర‌జా చైత‌న్యం తీసుకురాకుండా అదికారం కాంక్షించ‌డం కూడా హాస్యాస్ప‌దం అవుతుంది. తెలంగాణ‌లో అదికార టీఆర్ఎస్ పార్టీని మ‌ట్టిక‌రిపించాలంటే కాంగ్రెస్ పార్టీ రెండు ల‌క్ష్యాను నిర్ధేశించుకుని ముందుకు వెళ్లాల్సిఉంటుంది. మొద‌టిది తెలంగాణ‌లో అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ ఉండి, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న నేత‌ను ముందుపెట్టి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్ల‌డం, రెండోది ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ విధానాల మీద అనువ‌పెగ‌ర‌ని పోరాటం చేయ‌డం. ఈ రెండు అంశాలు స‌మ‌పాళ్ల‌లో ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌గ‌లిగితే కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అదికారం ఖాయంగా తెలుస్తోంది. అలా కాకుండా నామ‌మాత్ర‌పు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ గులాబీ పార్టీ వైఫ‌ల్యాలే కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫ‌లితాలు ఇస్తాయ‌నుకుంటే మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో సారి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర్కోక త‌ప్ప‌దు.

 పోరాటం, ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న నేత రంగంలోకి దిగితే కాంగ్రెస్ కి సునాయాస విజ‌యం..

పోరాటం, ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న నేత రంగంలోకి దిగితే కాంగ్రెస్ కి సునాయాస విజ‌యం..

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రావాల‌న్నా, ప్ర‌భుత్వ విధానాలపై చేస్తున్న విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల గుండెల్లో నాటుకు పోవాల‌న్నా, తెలంగాణ ప్ర‌జానికం కూడా ఆ నాయ‌కుడు చెప్పే మాట‌ల‌నే విశ్వ‌సించే ప‌రిస్థితిలో ఉన్న నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి లాంటి యువ నాయ‌కున్ని ముందువ‌రుస‌లో నిల‌బెడితే పార్టీ ప‌ట్టాలెక్కి ప‌రుగులు పెట్ట‌డం ఖాయ‌మ‌ని నిర్ధార‌ణ అవుతోంది. ఇటీవ‌ల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన పార్టీ జాతీయ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి కి ఉన్న ప్ర‌జాధ‌ర‌ణ చూసి ముచ్చ‌ట‌ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయ‌కుల్లో తెలంగాణ ప్ర‌జ‌లు ఏదైతే ఆశిస్తున్నారో అలాంటి క్వాలిటీస్ అన్ని పుష్క‌లంగా రేవంత్ రెడ్డిలో ఉన్నాయ‌ని, చంద్ర‌శేఖ‌ర్ రావుకు ప్ర‌త్యామ్నాయ నాయ‌కుడు రేవంత్ రెడ్డి మాత్ర‌మే న‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క‌సారి కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న వైరుద్యాలు, వైష‌మ్యాలు, విభేదాలు ప‌క్క‌న పెట్టి రేవంత్ రెడ్డి లాంటి నేత‌కు అవ‌కాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ అదికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే అంశం బ‌హిరంగ ర‌హ‌స్యం.

English summary
telangana public expecting two factors from congress party for next general elections. one is powerful leadership and another one is fighting against ruling party. telangana public bereaving that revanth reddy right person to bring congress party into power in the next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X