వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సర్వే అంతా తప్పుల తడకే, కాంగ్రెస్ కు 70 సీట్లు వస్తాయన్న చిన్నారెడ్డి

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని మాజీ మంత్రి వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రకటించారు. ముఖ్యమత్రి కెసిఆర్ తప్పుడు సర్వే రిపోర్టులతో అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఆయన

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని మాజీ మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తప్పుడు సర్వే రిపోర్టులతో అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఆయన ఆరోపించారు.

టిఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన చెప్పారు.తమ పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన సర్వే నివేదికలన్నీ తప్పుడు తడకలేనన్నారాయన. తప్పుడు నివేదికలతో ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

మూడేళ్ల పాలనలో ఉద్యోగులు, రైతులు విధ్యార్థులు, యువత, రైతులు ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఆయన చెప్పారు.

chinna reddy

సర్వేలతో కెసిఆర్ ఎమ్మెల్యేలకు, ప్రజలకు చెవిలో పూలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తమ పార్టీకి 70 స్థానాలు వస్తాయని ఆయన చెప్పారు.

అయితే ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని ఆయన కెసిఆర్ కు సవాల్ విసిరారు.

బడ్జెట్ సమావేశాలను 14 రోజులకే కుదించడం సరికాదన్నారు చిన్నారెడ్డి.కాంగ్రెస్ పార్టీ హయంలో బడ్జెట్ సమావేశాలను 30 రోజుల పాటు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.బిఎసీ సమావేశానికి సిఎం గైరాజర్ కావడం ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందన్నారు.గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఒక్క రోజుకే కుదించడంతో సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా పోతోందన్నారు.

సభ నుండి ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తోంందని ఆయన ఆరోపించారు.ప్రభుత్వ తప్పిదాలను సభలో ఎండగడతామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రభుత్వం చేసిన సర్వే బోగస్ అన్నారు.

English summary
congress party will be win 70 assembly seats in next elections said former minister chinnareddy on friday.cm kcr announanced fake survey reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X