వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా తెలంగాణ వ్యూహం: గాలానికి చిక్కుతారా?

కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిజెపి గాలం వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో స్వంతంగా పోటీచేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలను చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ నాయకులకు బిజెపి గాలం వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో స్వంతంగా పోటీచేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలను చేస్తోంది.అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకనేతలతో బిజెపి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.టిఆర్ఎస్ దెబ్బతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది.తాజాగా బిజెపి నాయకుల ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించారు. బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ ను కాంగ్రెస్ నిలువరిస్తోందా? లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ప్రయోజనం దక్కలేదు.గత ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి 21 మంది ఎమ్మెల్యేలే విజయం సాధించారు. టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ తో ఆ పార్టీ కుదేలైంది.

ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయి నాయకులు కూడ అధికారపార్టీబట్టారు. అయితే అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో టిడిపి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి.

అయితే తాజాగా బిజెపి కూడ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకొని బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టింది. రెడ్డి సామాజికవర్గానికిచెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు బిజెపి గాలం వేస్తోంది.

బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ ను కాంగ్రెస్ నిలువరించనుందా?

బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ ను కాంగ్రెస్ నిలువరించనుందా?

2019 ఎన్నికల్లో బిజెపి స్వంతంగా పోటీచేయాలని నిర్ణయానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీతో బిజెపి తెగదెంపులు చేసుకొంది. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ పావులుకదుపుతోంది. అయితే అందుకు అనుగుణంగా బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టికి చెందిన మాజీమంత్రులు, బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులతో బిజెపి నాయకులు చర్చించారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో అమిత్ షా మరోసారి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ సమయంలో బిజెపిలో చేరికలు ఉంటాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.

మెదక్ సభతో తేటతెల్లం

మెదక్ సభతో తేటతెల్లం

చాలామంది కాంగ్రెస్ నాయకులతో బిజెపి నాయకులు సంప్రదింపులు జరిపారు. అయితే బిజెపి నేతలతో టచ్ లో ఉన్న నాయకులకు ఆ పార్టీ పెద్ద పెద్ద ఆఫర్లను ఇస్తోంది. ఆయా నాయకుల బలాన్ని బట్టి వారు నాలుగు నుండి ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు, పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని బిజెపి నిర్ణయం తీసుకొంది. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మెదక్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన పేరుతో సభను నిర్వహిస్తోంది.ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు హజరుకానున్నారో తేటతెల్లం కానుంది. బిజెపితో టచ్ లో ఉన్న నేతలంతా సభకు వస్తారా, లేదా అనేది కూడ ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

నిరాశలో కాంగ్రెస్

నిరాశలో కాంగ్రెస్

తెలంగాణలో అధికారంలోకి రాకపోవడం ఆ పార్టిని నైరాశ్యంలో నెట్టింది. అయితే టిఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో కూడ ఆ పార్టీ వైఫల్యం చెందింది.అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోపల, బయట అనుసరించిన విధానాలు కొన్ని సందర్భాల్లో విమర్శలకు దారితీసింది.మరో వైపు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని టిఆర్ఎస్ ఉపయోగించుకొంది.అధికారపార్టీపై దూకుడుగా విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు చివరకు టిఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీ నుండి అలాంటి నాయకులు వెళ్ళకుండా నిలువరించలేకపోయింది నాయకత్వం.

ఒంటరిగా ఎదుర్కోలేకే

ఒంటరిగా ఎదుర్కోలేకే

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ను ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఓడించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో విపక్షాలు ఉన్నాయి.అయితే ఈ స్థితిలో విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడనున్నాయి. కాంగ్రెస్, టిడిపిలు కూడ కలిసిపోటీచేసేందుకు సన్నద్దమౌతున్నాయి.ఈ మేరకు ఈ రెండు పార్టీల నాయకులు కూడ ఇదే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలతో పాటు వామపక్షాలు, జనసేన కూడ కూటమిగా లేదా పొత్తులు ఏర్పాటుచేసుకొని పోటీచేసే అవకాశాలున్నాయి.

English summary
Congress party planning how to protect party in Telangana state.In Medak district Congress party arranged Rahulgandhi meeting on June 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X