వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీలిమిటేషన్‌ సాధ్యం కాదు, మహకూటమికి సన్నాహలు: జానారెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల సమయంలో కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు సిఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. అయితే ఈ మేరకు చర్చలు సాగిస్తున్నామని జానారెడ్డి చెప్పారు.

సిఎల్పీ నేత జానారెడ్డి బుదవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్దంగా జానారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.

తమ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకొనేందుకు కెసిఆర్ సర్వేల ఫలితాల పేరుతో ప్రజల్లో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి జానారెడ్డి చిట్ చాట్ చేశారు.

ఎన్నికల సమయంలో కూటమికి సిద్దం

ఎన్నికల సమయంలో కూటమికి సిద్దం

2019 ఎన్నికల సమయంలో కూటములు ఏర్పడడం సహజమేనని సిఎల్పీ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేక పార్టీలన్నీ కూటమిగా ఏర్పాటై పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. తాము కూడ ఆ ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

కాంగ్రెస్‌కు షాక్: టిఆర్ఎస్‌కు 102 సీట్లు, ముందస్తుకు కెసిఆర్ సై కాంగ్రెస్‌కు షాక్: టిఆర్ఎస్‌కు 102 సీట్లు, ముందస్తుకు కెసిఆర్ సై

ముందస్తు ఎన్నికలకు రెడీ

ముందస్తు ఎన్నికలకు రెడీ

2019లో నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగినా తాము సిద్దంగానే ఉన్నామని సిఎల్పీ నేత జానారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ యంత్రాంగమంతా ఎన్నికలకు సర్వ సన్నద్దమైందని జానారెడ్డి చెప్పారు. ఈ దఫా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధిస్తోందని జానారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

పవన్‌కు తెలంగాణపై ప్రేమెందుకు పుట్టింది, వైఎస్ఆర్‌ నాకు లైప్ ఇచ్చారు: పొన్నం పవన్‌కు తెలంగాణపై ప్రేమెందుకు పుట్టింది, వైఎస్ఆర్‌ నాకు లైప్ ఇచ్చారు: పొన్నం

డీలిమిటేషన్ సాధ్యం కాదన్న జానా

డీలిమిటేషన్ సాధ్యం కాదన్న జానా

2019 ఎన్నికల కంటే ముందుగానే డీలిమిటేషన్ సాధ్యం కాదని సిఎల్పీ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగినా తమకు అభ్యంతరం లేదని జానారెడ్డి తేల్చి చెప్పారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ముందస్తు ఎన్నికలకు కేంద్రం మొగ్గు చూపుతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో డీలిమిటేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని జానారెడ్డి వ్యక్తం చేశారు.

టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు? టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?

సర్వేలతో కెసిఆర్ జిమ్మిక్కులు

సర్వేలతో కెసిఆర్ జిమ్మిక్కులు

సర్వేల పేరుతో కెసిఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని సిఎల్పీ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 102 స్థానాల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తోందని చెప్పుకోవడాన్ని జానారెడ్డి తప్పు బట్టారు. ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నందునే కెసిఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.

English summary
We are plannig to Mahakutami for 2019 elections said CLP leader Jana Reddy. Along with TPCC chief Uttamkumar Reddy Jana Reddy chit chat with media on Wednesday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X