• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చనిపోతే తీర్థయాత్రలకు వెళ్లినట్లు వెళ్తారా: వెంకయ్య, హెచ్‌సియులో ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: యూనివర్సిటీలో విద్యార్థులు చనిపోతే తీర్థయాత్రలకు వెళ్లినట్లు విశ్వవిద్యాలయానికి వెళ్లి రాజకీయాలు చేయడం విడ్డూరమని, బాధాకరమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని అభిప్రాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్య విషయంలో అందరూ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. అసహనం ప్రజలలో ఏమాత్రం లేదని, రాజకీయ పార్టీలలోనే ఉందన్నారు.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే దేశంలో మతసామరస్యం పెరిగిందని చెప్పారు. ఇదిలా ఉండగా, సోమవారం నాడు చలో హెచ్‌సియుకు కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు పలువురు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, కళాశాలల నుంచి విద్యార్థులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో ప్రత్యేక పికెట్‌ ఏర్పాటు చేసి ఉదయం నుంచే తనిఖీలు చేపట్టారు.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హెచ్‌సీయూకి వచ్చిన విద్యావేత్తలు, ఉద్యమకారులు, విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. రాజకీయ నాయకులకు అనుమతి నిరాకరించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి ర్యాలీగా ప్రధాన ద్వారం వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

తాముఎవరిని అడ్డుకోవడం లేదని, ఐడీ కార్డులు చూసి పంపుతున్నామని పోలీసులు తెలుపడంతో విద్యార్థులు శాంతించారు. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు రోజి ఎం జాన్‌, ఢిల్లీ జేఎన్‌యూ, మాను, పుదుచ్చేరి, ఆంధ్ర, ద్రవిడ వర్సిటీలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కటక్‌, కాలికట్‌ల్లోని పలువిశ్వవిద్యాలయాల విద్యార్థులు, ఐఐటీ ముంబై, చెన్నై విద్యార్థులూ సంఘీభావం ప్రకటించారు.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

తొలుత సభలో బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు, భరియా బహుజన్‌ మహాసంఘ్‌ నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ.. ఈ పోరాటాన్ని దేశం నలుదిశలకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు నేడు అమలు కావడం లేదని, దేశంలో సమానత్వం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

ఈ పోరాటం ఒకరకంగా మేధావుల యుద్ధమని ప్రకాశ్ వ్యాఖ్యానించారు. చలో హెచ్‌సీయూకు హాజరైన విద్యార్థులు రోహిత్‌ చిత్రాలను ముద్రించిన టీ షర్టులను ధరించి సభలో పాల్గొన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

తాత్కాలిక ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన విపిన్‌ శ్రీవాత్సవ వెంటనే తప్పుకోవాలని హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీ ఫోరం సభాముఖంగా డిమాండ్‌ చేసింది. 2008లో పీహెచ్‌డీ విద్యార్థి సేంథిల్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, అందులో ఈయన పాత్ర ఉందని, ఇప్పుడు పాలకమండలి ఉప సంఘం ఛైర్మన్‌గా ఉండి రోహిత్‌ ఆత్మహత్యకు కారకులయ్యారని ఫోరం ఆరోపించింది. అయిదుగురు దళిత విద్యార్థులను బహిష్కరించడానికి కారణం ఆయనేనని, అందువల్ల న్యాయ విచారణ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో వీసీ పదవి నుంచి తప్పుకోవాలని ఫోరం డిమాండ్‌ చేసింది.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

తమ సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ విద్యార్థులు డి ప్రశాంత్‌, వి రోహిత్‌ చక్రవర్తి, పి విజయ కుమార్, సీహెచ్ శేషయ్య, వి సుంకన్నలు ఉమ్మడి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు, తన కుమారుడికి రక్షణ కల్పించాలంటూ ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్‌ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ పివి సంజయ్ కుమార్‌ విచారణ చేపట్టారు.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

సస్పెన్షన్‌ ఎత్తివేశామని యూనివర్సిటీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. విద్యార్థులపై సస్పెన్షన్‌ కొనసాగుతోందని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది బొజ్జా తారకం చెప్పారు. సస్పెన్షన్‌ ఎత్తివేశామని చెబుతున్నా ఆ ఉత్తర్వులు తమకందలేదన్నారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు యూనివర్సిటీ ప్రకటించినందున దీనిపై తదుపరి విచారణ జరపాల్సిన అవసరం ఏముందో చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

సస్పెన్షన్‌ ఎత్తివేతకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టుతోపాటు పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు అందజేయాలని యూనివర్సిటీ తరఫు న్యాయవాదికి సూచిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్‌ ఫిర్యాదుపై దర్యాప్తునకు అదనపు కౌంటరు దాఖలు చేస్తామని తెలంగాణ హోంశాఖ హైకోర్టుకు తెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress 'politicising' Rohith Vemula suicide issue, says Union Minister Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more