వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా?: సోనియా, టి కాంగ్రెస్ నేతలకు అభినందన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా అని ఆమె మండిపడ్డారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 50 మంది ఓయూ విద్యార్థుల బృందం శనివారం సోనియా గాంధీని కలిసింది.

ఈ సందర్భంగా విద్యార్థులతో సోనియా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు. తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తోందని, యుద్ధానికి సిద్ధం కావాలని టీపీసీసీ, ఓయూ జేఏసీ విద్యార్థులకు సోనియా సూచించారు. రాహుల్ గాంధీ ఓయూకి రాహుల్‌ను వర్సిటీకి ఎందుకు ఆహ్వానిస్తున్నారని సోనియా విద్యార్థులను ప్రశ్నించారు.
అంతేగాక, తెలంగాణలో ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను సోనియాకు విద్యార్థులు వివరించారు. రాష్ట్రంలో అన్ని పనులు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయని, కోర్టుల చుట్టూ తిరిగితే తప్ప పని కావడంలేదని ఆమెకు చెప్పారు.

పరిపాలన ఇప్పుడు నలుగురి పాలనగా మారిందనీ, విద్యార్థులను వాడుకొని వదిలేశారని చెప్పారు. చివరకు ఏదైనా సమస్య గురించి మాట్లాడదామన్నా అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని ఇస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ దాన్ని అమ్ముకుంటున్నారని తెలిపారు. విద్యార్థి బృందం చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్న సోనియా.. విద్యార్థుల ఆత్మబలిదానాలు ఇక ఉండకూడదనే తెలంగాణ ఇచ్చామని చెప్పారు.

ప్రస్తుతమున్న సమస్యలపై పోరాటం కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేయాలని టీపీసీసీ నేతలకు సోనియా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య యుద్ధం చేయడానికి క్యాడర్‌ను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల బాగుకోసం కాంగ్రెస్‌ ముందుంటుందని, విద్యార్థి ఉద్యమాలకు పార్టీ అండగా ఉంటుందని ఓయూ బృందానికి సోనియా హామీ ఇచ్చారు.

తెలంగాణ నేతలకు అభినందనలు

తెలంగాణలో సమస్యలపై పోరాడుతున్న టిపిసిసికి అభినందనలు లభించాయి. అంతా కష్టపడి పనిచేస్తున్నారని ఆమె కితాబిచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ భట్టివిక్రమార్కను సోనియా ప్రశంసించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు మరోమారు కృతజ్ఞతలు తెలిపామని ఉత్తమ్‌ చెప్పారు.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించామన్నారు. సోనియాను కలిసినవారిలో ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌, పార్టీ అధికార ప్రతినిధు లు అద్దంకి దయాకర్‌, దాసోజు శ్రావణ్‌, ఓయూ జేఏసీ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, అధ్యక్షుడు లోకేష్‌ యాదవ్‌, కైలాష్‌ నేత, మానవతారాయ్‌, దరువు ఎల్లన్న తదితరులున్నారు.

సోనియా కలిసిన టి కాంగ్రెస్, ఓయూ నేతలు

సోనియా కలిసిన టి కాంగ్రెస్, ఓయూ నేతలు

తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా అని ఆమె మండిపడ్డారు.

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 50 మంది ఓయూ విద్యార్థుల బృందం శనివారం సోనియా గాంధీని కలిసింది.

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

ఈ సందర్భంగా విద్యార్థులతో సోనియా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు. తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తోందని, యుద్ధానికి సిద్ధం కావాలని టీపీసీసీ, ఓయూ జేఏసీ విద్యార్థులకు సోనియా సూచించారు.

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీ ఓయూకి రాహుల్‌ను వర్సిటీకి ఎందుకు ఆహ్వానిస్తున్నారని సోనియా విద్యార్థులను ప్రశ్నించారు. అంతేగాక, తెలంగాణలో ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు.

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రంలోని పరిస్థితులను సోనియాకు విద్యార్థులు వివరించారు. రాష్ట్రంలో అన్ని పనులు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయని, కోర్టుల చుట్టూ తిరిగితే తప్ప పని కావడంలేదని ఆమెకు చెప్పారు.

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

పరిపాలన ఇప్పుడు నలుగురి పాలనగా మారిందనీ, విద్యార్థులను వాడుకొని వదిలేశారని చెప్పారు. చివరకు ఏదైనా సమస్య గురించి మాట్లాడదామన్నా అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదన్నారు.

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

సోనియాను కలిసిన టి కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని ఇస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ దాన్ని అమ్ముకుంటున్నారని తెలిపారు. విద్యార్థి బృందం చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్న సోనియా.. విద్యార్థుల ఆత్మబలిదానాలు ఇక ఉండకూడదనే తెలంగాణ ఇచ్చామని చెప్పారు.

English summary
Congress president Sonia Gandhi on Saturday fired at Telangana Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X