హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వద్దన్నా ఇప్పించారు, కేటీఆర్ హస్తం!: ఎంసెట్ లీకేజ్‌పై కాంగ్రెస్ సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శనివారం నాడు ఎంసెట్ లీకేజీ పైన సంచలన ఆరోపణలు చేశారు. లీకేజీలో మంత్రి కల్వకుంట్ర తారక రామారావు పాత్ర పైన వారు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. సీఎల్పీలో ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు.

వారు మాట్లాడుతూ.. క్వశ్చన్ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయని, అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఎంసెట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సీబీ ఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే లీకేజీ అయిందని విమర్శించారు. పది, ఇంటర్ పత్రాల ముద్రణ ఇవ్వకుండా బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీకి ఎంసెట్ పత్రాల ముద్రణ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌కు ఆ కంపెనీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో తేల్చాలన్నారు.

తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వారు చెప్పారు. కేసును సీబీఐకి అప్పగిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను తాము అందచేస్తామని చెప్పారు. వీసీల నియామాకనికి సంబంధించి హైకోర్టు వ్యాఖ్య పైన ముఖ్యమంత్రి స్పందించకపోవడం న్యాయవ్యవస్థను కించపరచడమే అవుతుందన్నారు.

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

ఎంసెట్ 2 ప్రశ్నాపత్రాల లీకేజీలో మంత్రి కేటీఆర్ హస్తం ఉందని ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ ఆరోపించారు.

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

ఎంసెట్ 2కు సంబంధించి ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు, బయోమెట్రిక్ అటెండెన్స్, ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్, వ్యాల్యుయేషన్ పనులను మాగ్నెటిక్ ఇన్ఫోటెక్ అనే కంపెనీకి అప్పగించారని మండిపడ్డారు.

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

ఈ సంస్థను ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులు గతంలోనే బ్లాక్ లిస్టులో పెట్టాయని చెప్పారు. జేఎన్టీయు అధికారులు ఈ కంపెనీ సరైంది కాదని చెప్పినా ప్రభుత్వం పెడ చెవిన పట్టిందన్నారు.

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

కేటీఆర్ పైన కాంగ్రెస్ ఆరోపణ

మంత్రి కేటీఆర్ సిఫార్సు మేరకు సదరు కంపెనీకి పనులు అప్పగించినట్లు షబ్బీర్ అలీ ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.

English summary
The Telangana Congress Legislature Party on Saturday suspected the involvement of Information Technology Minister K. Tarakarama Rao in the leakage of Eamcet-2 question paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X