హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గెలుపే లక్ష్యంగా మ్యానిఫెస్టో, కొత్త పథకాలతో టిఆర్ఎస్ కు కాంగ్రెస్ చెక్ ఇలా...

2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమౌతోంది.ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమౌతోంది.ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యూహారచన చేస్తోంది. ఏడాది ముందే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించనుంది.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాదని టిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టడం వెనుక అనేక కారణాలున్నాయి.అయితే తమ మేనిఫోస్టోలోని అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళలేకపోయినట్టు ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మేరకు 2019 ఎన్నికలకు ఏడాది ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాలని ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.ఈ మేరకు మేనిఫెస్టో తయారు చేస్తున్నారు.

మరో వైపు పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చే అంశాలన్నీ కూడ ఒకేసారి విడుదల చేయకుండా ఒక్కొక్క హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఏడాది ముందే ఎన్నికల మ్యానిఫెస్టో

ఏడాది ముందే ఎన్నికల మ్యానిఫెస్టో

ఏడాది ముందే ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా తమను అధికారంలోకి తెచ్చేలా మ్యానిఫెస్టోకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతోంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మ్యానిఫెస్టోను తయారు చేస్తున్నారు. ఏడాది ముందే మ్యానిపెస్టోను విడుదల చేయనున్నారు. ఈ మ్యానిఫెస్టోలోని అంశాలను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది.

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ కసరత్తు

రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ కసరత్తు

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఎకరానికి నాలుగువేల రూపాయాలను రైతులకు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.అంతేకాదు ఎరువులను కూడ ఉచితంగానే ఇస్తానని ప్రకటించారు.అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడ రైతాంగ సమస్యలపై కేంద్రీకరించింది.తమ పార్టీ ప్రకటించాలనుకొన్న విధానాలనే ముఖ్యమంత్రి ప్రకటించారని ఆ పార్టీ నాయకులు చెప్పారు.అయితే విత్తనాలు నాటే సమయంలోనే ఆయా పంటలకు ధరలను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిందింది. కౌలు రైతులను ఏ రకంగా ఆదుకోవాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కౌలు రైతులకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.మరో వైపు రెండులక్షలవరకు పంటరుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలను కురిపించనుంది.

ఒక్కో వాగ్దానం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయం

ఒక్కో వాగ్దానం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని నిర్ణయం

ఒక్కో వాగ్ధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అన్ని హామీలను ఒకేసారి ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా అంతగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోంది. అదే సమయంలో ఒక్కో వాగ్ధానాన్ని క్షేత్రస్థాయిలోకి వెళ్ళేలా ప్రతి గ్రామంలో సభ నిర్వహించి ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించాలని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది.ఈ హమీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేందుకు పోస్టర్లు, కరపత్రాలు, సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

కొత్త పథకాలకు కాంగ్రెస్ రూపకల్పన

కొత్త పథకాలకు కాంగ్రెస్ రూపకల్పన

తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సాఫ్ట్ వేర్ రంగంలో అవకాశాలు, ఐటీఐఆర్, లాంటి ప్రాజెక్టులనుు పూర్తి చేస్తామనే వాగ్ధానాలను ఇవ్వనున్నారు. అంతేకాదు ఉద్యోగావకాశాలతో పాటు ప్రజలను ఆకర్షించేందుకుగాను కొత్త పథకాలను రూపొందించనున్నారు. ఉచిత ఎరువులు, రిజర్వేషన్ల అంశాన్ని టిఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. అయితే టిఆర్ఎస్ చేసే ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది.

English summary
congress will be announce manifesto one year before election, party leaders will preparing manifesto.it is focus on farmers issues in manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X