హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు ప్రైవేటు సైన్యంలా, వారిళ్లలో కోట్లు దొరకుతాయి: అధికారులకు రేవంత్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయనకు కొన్ని మీడియాలు కూడా వంతపాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

<strong>'సీమాంధ్రులకు అండగా' చక్కగా చెప్పారు: కేటీఆర్‌పై జేపీ ప్రశంసలు, ఏమన్నారంటే..?</strong>'సీమాంధ్రులకు అండగా' చక్కగా చెప్పారు: కేటీఆర్‌పై జేపీ ప్రశంసలు, ఏమన్నారంటే..?

విద్రోహ శక్తులుగా మీడియా..

విద్రోహ శక్తులుగా మీడియా..

టీఆర్ఎస్ సొంత మీడియా, వారి బంధువుల మీడియా సంస్థలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు రేవంత్ తెలిపారు. ఆ మీడియా సంస్థలు ఇతర పార్టీలపై వ్యతిరేక ప్రచారం చేస్తూ.. టీఆర్ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మీడియా సంస్థలను ప్రచార సాధనాలుగా పరిగణించకుండా నిసేధించాలని ఈసీని కోరామని తెలిపారు. వాటిని నిర్వహించే వారిని సంఘ విద్రోహ శక్తులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

90శాతం టీఆర్ఎస్ పార్టీకే ప్రచారం

90శాతం టీఆర్ఎస్ పార్టీకే ప్రచారం

ఎన్నికల కోడ్‌కు సంబంధించి ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇక్కడి అధికారులు స్పందించట్లేదని అన్నారు. టీఆర్ఎస్ మీడియాతో ఇతర మీడియా సంస్థలు కూడా టీఆర్ఎస్‌కే 90శాతం సమయం కేటాయిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

Recommended Video

Telangana Elections 2018 : విరాట్ కోహ్లీలా సెంచరీ కొడతాం : హరీష్ రావు
 కేసీఆర్‌కు ప్రైవేటు సైన్యంలా వారంతా..

కేసీఆర్‌కు ప్రైవేటు సైన్యంలా వారంతా..

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, అందుకే పదవీ విరమణ చేసిన వేణుగోపాలరావును మళ్లీ నియమించారని ఆరోపించారు. డీజీపీ నేతృత్వంలో కొంతమంది పోలీసులు కేసీఆర్‌కు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కేసీఆర్ పాలన.. నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు.

వారిళ్లలో దాడులు చేస్తే కోట్లు దొరుకుతాయి..

వారిళ్లలో దాడులు చేస్తే కోట్లు దొరుకుతాయి..

ప్రగతి భవన్, మంత్రుల నివాస ప్రాంగణంలో టీఆర్ఎస్ సమావేశాలు జరుగుతున్నాయని, అక్కడి నుంచే కోట్ల రూపాయల డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు, వారి మిత్రుల నివాసాలపై ఆదాయపుపన్ను శాఖ నిఘా పెడితే కోట్ల రూపాయలు బయటపడతాయన్నారు. తమ ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ తగిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని చెప్పారు.

అధికారుల పేర్లు డైరీలో రాస్తున్నాం..

అధికారుల పేర్లు డైరీలో రాస్తున్నాం..

ప్రభుత్వ అధికారులు చట్ట పరిధిలో ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని, టీఆర్ఎస్ నేతల ఆదేశాలను అధికారులు పట్టించుకోవద్దని కోరారు. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవారు, కాంగ్రెస్ నేతలను వేధించే వారి కోసం ప్రత్యేక డైరీ పెట్టామని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

English summary
Congress working president revanth reddy allegations on media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X