వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''విషమిచ్చి చంపండి,బతికుండగానే అనాథలుగా మార్చారు''

వీణా వాణిలను స్టేట్ హోంకు తరలించడాన్ని వారి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తమ పిల్లలను చూసేందుకు కూడ అనుమతి ఇవ్వడం లేదన్నారు. విషమిచ్చి చంపాలని వారు కోరారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :అవిభక్త కవలలు వీణా వాణిలను స్టేట్ హోంకు తరలించడాన్ని వారి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తమకు విషమిచ్చి చంపాలన్నారు. దేవుడిపై భారమేసి తమ పిల్లలకు ఆసరేషన్ చేయాలని తల్లిదండ్రులు కోరారు.

అవిభక్త కవలలు వీణా వాణిలను నిలోఫర్ నుండి స్టేట్ హోంకు తరలించారు. నిబంధనల అడ్డంకి కారణంగానే నిలోషర్ నుండి స్టేట్ హోంకు తరలించారు.అయితే స్టేట్ హోంకు కవలలను తరలించేందుకు వారి తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు.

అవిభక్త కవలలు వీణావాణిలను వేరుచేసేందుకు శస్త్రచికిత్స చేస్తే అనుకూలమైన పలితాలు తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల మాటలను బట్టి శస్త్రచికిత్సకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.

ఎయిమ్స్ తో పాటు విదేశాల నుండి వచ్చిన వైద్య నిపుణులు కూడ వీణా వాణిలకు వైద్యం చేయడం వల్ల వారు బతికే ఛాన్స్ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.13 ఏళ్ళ దాటినందున వీణా వాణిలను స్టేట్ హోంకు తరలించారు.

స్టేట్ హోంకు వీణా వాణిలను తరలించడాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు

స్టేట్ హోంకు వీణా వాణిలను తరలించడాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు

నిలోఫర్ ఆసుపత్రిలో ఉన్న అవిభక్త కవలలు వీణా వాణిలను స్టేట్ హోంకు తరలించడాన్ని వారి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మిలు వ్యతిరేకిస్తున్నారు. తమకు విషమిచ్చి చంపేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు మాట మాత్రంగా చెప్పకుండా నిలోఫర్ నుండి వీణా వాణిలను స్టేట్ హోంకు తరలించడాన్ని వారు తప్పుబట్టారు. స్టేట్ హొంకు తమ పిల్లలను తరలించిన విషయాన్ని తెలుసుకొన్న దంపతులు స్టేట్ హోం వద్దకు చేరుకొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులకు నిమిషం పాటు అనుమతి

తల్లిదండ్రులకు నిమిషం పాటు అనుమతి

స్టేట్ హోంకు వీణా వాణిలను తరలించడంతో అక్కడ ఉన్న తమ పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. స్టేట్ హోం పిడి కేవలం నిమిషం పాటు మాత్రమే అనుమతి ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తమ పిల్లలను చూసుకొనేందుకు అనుమతి తీసుకోవాలా అని వారు ప్రశ్నించారు. స్వంత రాష్ట్రంలో కూడ తమకు న్యాయం జరగడం లేదని వారు ఆరోపించారు.

వీణా వాణిలను వేరుచేయండి

వీణా వాణిలను వేరుచేయండి

వీణా వాణిలకు శస్త్రచికిత్స చేసి వారిని విడదీయాలని తల్లిదండ్రులు కోరతున్నారు.ఈ మేరకు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అయితే తమకు తగిన జీవన భృతిని కల్పిస్తే తమ పిల్లలను తామే చూసుకొంటామని తల్లిదండ్రులు చెప్పారు. దేవుడిపై భారం వేసి తమ పిల్లలకు శస్త్రచికిత్స చేయాలని తల్లిదండ్రులు కోరారు.

అన్ని సౌకర్యాలు కల్పించాం

అన్ని సౌకర్యాలు కల్పించాం

స్టేట్ హోం లో వీణా వాణిలకు స్టేట్ హోంలో అన్ని సౌకర్యాలు కల్పించామని జూబ్లిహిల్స్ ఎంఏల్ఏ మాగంటి గోపినాథ్ చెప్పారు.స్టేట్ హోంలో సుమారు గంటపాటు ఆయన ఆ చిన్నారులతో గడిపారు. వారికి బిస్కట్లు, చాక్లెట్లు పంపిణీ చేశాడు. వీణా వాణిలకు శస్త్రచికిత్స విషయమై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారని ఆయన చెప్పారు.వీణా వాణిలకు చికిత్స విషయంలో వైద్య సౌకర్యాలతో పాటు ఇతర అవసరాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదన్నారు.

శస్త్రచికిత్సకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు

శస్త్రచికిత్సకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు

అవిభక్త కవలలు వీణా వాణిలకు శస్త్రచికిత్స చేస్తే వారు బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.వీరికి చిన్నతనంలోనే ఆపరేషన్ చేస్తే పలితాలు మరోలా ఉండేవనే అభిప్రాయాన్ని కొందరు వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు ముందుకురావడం లేదు. ఓక వేళ ముందుకు వచ్చిన వారు బతికే అవకాశాలు తక్కవనే అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కూడ వారికి శస్త్రచికిత్స చేయించే విషయంలో కొంత వెనక్కు తగ్గింది.

నిలోఫర్ లోనే ఎక్కువ కాలం ఉన్న వీణా వాణిలు

నిలోఫర్ లోనే ఎక్కువ కాలం ఉన్న వీణా వాణిలు

పుట్టిన తర్వాత కొంత కాలం పాటు గుంటూరు ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడి నుండి నిలోఫర్ ఆసుపత్రిలోనే వీణా వాణిలు గడిపారు. నిలోఫర్ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది వారి ఆలనా పాలన చూసేవారు. పిల్లలను పోషించే స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు చెప్పడంతో నిలోఫర్ లోనే వారికి ప్రత్యేక గదిని కేటాయించి అక్కడే వారిని ఉంచుతున్నారు. సుమారు పదేళ్ళకు పైగా ఇదే ఆసుపత్రిలో వారు ఉన్నారు. అయితే నిబంధనల కారణంగానే వారిని స్టేట్ హోం కు తరలించారు.

English summary
cojoined twins veena vani shifted to state home on sunday, parents of veena vani unhappy with government decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X