వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపాధి పేరుతో వంచన : ఆదివాసీ మహిళను మధ్యప్రదేశ్‌లో విక్రయించిన కానిస్టేబుల్, కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : నమ్మినొళ్లే నట్టేట ముంచారు. పని కల్పిస్తామని చెబితే నమ్మడమే ఆమెను కష్టాల్లోకి నెట్టింది. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడింది. చివరికి ఎలాగోలా తప్పించుకొని బయటపడింది. తనను మోసం చేసి .. విక్రయించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ యువతి విక్రయం కలకలం రేపింది. దగ్గరి బంధువు, ఓ పోర్టు కానిస్టేబుల్ కలిసి యువతిని మధ్యప్రదేశ్‌లో విక్రయించారని తెలిసి .. ఆమె పేరెంట్స్ నిర్ఘాంతపోయారు. నీచులపై చర్యలు తీసుకోవానలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం చాపిడికి చెందిన యువతి ఉపాధి కోసం చూస్తోంది. పని లభిస్తే కుటుంబాన్ని పోషించుకోవాలని భావిస్తోంది. ఇంతలో దగ్గరి బంధువైన ఆశ్రం గౌర్ భాయి .. ఆమె అవసరాన్ని గుర్తించాడు. ఆమెను విక్రయించి సొమ్ముచేసుకోవాలని భావించాడు. తన ప్రణాళికను స్నేహితులతో పంచుకున్నాడు. ఇతనికి రెబ్బన మండలానికి చెందిన వెంకటి సహకారం అందించాడు. మరొకతను పోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హరిదాస్ .. ఇతనైనా చేసేది తప్పని చెప్పాలి. కానీ అలా చేయలేదు. యువతిని విక్రయించి సొమ్ముచేసుకునేందుకు చేయి కలిపాడు.

constable cheat to women.. he sell in madhya pradesh

వీరంతా కలిసి మహిళకు ఉపాధి పేరు చెప్పి నమ్మించారు. ఆమెను మధ్యప్రదేశ్ తీసుకెళ్లారు. పని కల్పిస్తామని చెప్పి .. దర్వాజలో రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన లాల్ గిరీ స్వామికి విక్రయించారు. కానీ ఆమెకు జరిగింది ఏదో తెలిసి రాలేదు. తర్వాత వారు మెల్లగా జారుకొని .. పనికి కాకుండా చాకిరీ చేయించడంతో విషయం అర్థమైంది. తర్వాత మాటల్లో వారు తనను రూ.1.30 లక్షలకు విక్రయించారని తెలుసుకుంది. ఇక ఇక్కడ లాభం లేదని భావించింది. తప్పించుకునేందుకు అదనుకోసం చూసింది. ఎవరూ లేని సమయం చూసి .. స్వగ్రామానికి తరలొచ్చింది. తనకు జరిగిన అన్యాయం గురించి తల్లికి వివరించగా .. వారు ఆశ్రం భీం అండ్ కోం పై కేసు నమోదు చేశారు.

English summary
Thiriani Mandalam of the district of asifabad is looking for employment. The family hopes to nourish it if it gets work. Meanwhile, a close relative, Ashram Gaur Bhai, He wanted to sell her and make money. He shared his plan with friends. He was supported by Venkati from the Rebbana Zone. Haridas, who works as a port constable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X