హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి: ఫీట్జీ సంస్థకు తేల్చిచెప్పిన కన్జూమర్ కమిషన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ విద్యార్థి ఫీజు విషయంలో వినియోగదారుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. తనకు బోధన నచ్చలేదని, చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చేసతిన వినితిని ఫీట్జీ పినాకిల్ సంస్థ తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో సంస్థపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోచింగ్ మానేసిన విద్యార్థికి ఫీజు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత సంస్థకు హైదరాబాద్ జిల్లా రెండో వినియోదారుల కమిషన్ ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది.

 consumer commission orders to refund fiitjee fee to student

ఎఫ్ఐఐటీజేఈఈ(ఫీట్జీ) కోర్సులో చేరి తర్వాత మానేసిన విద్యార్థి తన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే, సంస్థ అందుకు నిరాకరించింది. దీనిపై సదరు విద్యార్థి వినియోదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు .అతడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఫీట్జీ సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వాదనలు విన్న తర్వాత తీర్పు ఇచ్చింది.

చేరే సమయంలో విద్యార్థికి తిరిగి ఫీజు చెల్లించబోమనే విషయాన్ని చెప్పామని, ఈ ఒప్పందంపై సదరు విద్యార్థి సంతకం కూడా చేశాడని సంస్థ వాదనలు వినిపించింది. అయితే, సంస్థ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ఫీజు వివాదం ఫీజు వివాదం వినియోదారుల కమిషన్ పరిధిలోకి రాదని ఫీట్జీ విద్యాసంస్థ పేర్కొనగా కమిషన్ తోసిపుచ్చింది.

విద్యా సంస్థ ముసుగులో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారా? అని కమిషన్ మండిపడింది. ఆ విద్యార్థికి రూ. 4.35 లక్షల ఫీజు, రూ. 50వేల పరిహారం చెల్లించాలని పీట్జీ సంస్థకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది 45 రోజుల్లో చెల్లించకపోతే 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.

English summary
consumer commission orders to refund fiitjee fee to student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X