వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీభవన్ ఎదుట ఉద్రిక్తత,కాంట్రాక్టులెక్చరర్ల అరెస్టు

గాంధీభవన్ ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్ లెక్చరర్లను పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ ఎదుట శుక్రవారం నాడు ఉద్రిక్తత నెలకొంది.గాంధీ భవన్ ఎదుట ధర్నాకు దిగేందుకు యత్నించిన కాంట్రాక్టు లెక్చరర్లను పోలీసులు అరెస్టు చేశారు.
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం జి.వో నెంబర్ 16 ను విడుదల చేసింది.అయితే ఈ జివోను నిరసిస్తూ మానవతారాయ్ కోర్టులో కేసు దాఖలు చేశాడు.

కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్దీకరణను నిరసిస్తూ కోర్టులో కేసును దాఖలు చేసిన మానవతారాయ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు.దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు గాంధీ భవన్ ఎదుట ధర్నాకు దిగే ప్రయత్నం చేశారు.

contract lecturers protest infront of gandhi bhavan

ఈ ధర్నా ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొన్నారు. అంతేకాదు గాంధీ భవన్ ఎదుట బ్యానర్లను కట్టారు కాంట్రాక్టు లెక్చరర్లు .అయితే ఈ బ్యానర్లను తొలగించారు పోలీసులు.

మరో వైపు కాంట్రాక్టు లెక్చరర్లలో అందరూ అర్హులు లేరనేది మానవతారాయ్ వాదన. కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనకు పోటీగా మానవతారాయ్ నేతృత్వంలోని నిరుద్యోగ జెఎసి నాయకత్వంలో టిఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయనున్నట్టు మానవతారాయ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు టిఆర్ ఎస్ కార్యాలయం ఎదుట కూడ పోలీసులు భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.

English summary
contract lecturers protest infront of gandhi bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X