ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాదాల్లో RRR:రాజమౌళికి బీజేపీ ఎంపీ సోయం బాబూరావు వార్నింగ్.. ఏం జరుగుతోంది..?

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్ : దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్‌ఆర్ఆర్. సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంటోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంకు సంబంధించి కొద్దిరోజుల క్రితం విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో వివాదాలు చుట్టుముట్టాయి. తాజాగా బీజేపీ నేత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

 రాజమౌళికి సోయం బాబూరావు వార్నింగ్

రాజమౌళికి సోయం బాబూరావు వార్నింగ్

రాజమౌళి సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి భారీ విజయాలను అందుకున్న ఈ దర్శకధీరుడు... భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా తీసి భారతీయ చలన చిత్ర రంగంలో అప్పటికే ఉన్న రికార్డులను చెరిపివేశాడు. మగధీర, బాహుబలి, మర్యాద రామన్న లాంటి చిత్రాలు తీసిన సమయంలో కూడా వివాదాలను మూటగట్టుకున్న రాజమౌళి... తాజాగా తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఇందుకు కారణం ఈ మధ్యే రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ టీజర్. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రను చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే నిజాంలపై పోరాటం చేసిన గిరిజన బిడ్డ కొమరం భీంను ముస్లింలు ధరించే టోపీతో చూపించడాన్ని చాలామంది జీర్ణించుకోలేకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు కూడా రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Recommended Video

RRR Pre Release Business For OTT, Satellite Closes At Record Price | Oneindia Telugu
 విడుదలకు ముందు మార్పులు చేయకుంటే..

విడుదలకు ముందు మార్పులు చేయకుంటే..

రాజమౌళి తీస్తున్న ఆర్‌ఆర్ఆర్ చిత్రంలో గిరిజన బిడ్డ కొమరం భీం పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నాడు. అయితే రాజమౌళి వాస్తవ కథకు భిన్నంగా కొమరం భీం పాత్రను చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు మార్పులు చేయకుంటే విడుదల తర్వాత థియేటర్లకు నిప్పు పెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్ఆర్‌ఆర్ సినిమా లాభాల కోసం తమ గిరిజన నాయకుడు కొమరం భీంను అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని సోయం బాబూరావు హెచ్చరించారు.

నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన బిడ్డ కొమరం భీం

కొమరం భీం నిజాంలకు వ్యతిరేకంగా పోరాడాడని, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప వీరుడని సోయం బాబూరావు చెప్పారు. అంతేకాదు నిజాంలు ధరించే టోపీని కొమరం భీం పాత్రకు పెట్టడమంటే గిరిజనులను అవమానించినట్లే అని విమర్శించారు. చరిత్ర తెలుసుకుని సినిమా తీయాలని, అలా కాకుండా వాస్తవాలను వక్రీకరించి విడుదల చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోయం బాబూరావు రాజమౌళిని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 22వ తేదీన ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్ జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేసింది. కొమరం భీం జయంతి రోజున ఈ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ విడుదల అయినప్పటి నుంచే పలు హిందూ సంఘాలు, కొమరం భీం అభిమానులు టీజర్ పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి ఒక టీజర్‌తోనే ఆర్‌ఆర్‌ఆర్ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఇంకా సినిమాలో ఎన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయో అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చరిత్రకు సంబంధించి వచ్చిన సినిమాలు కచ్చితంగా వివాదం లేకుండా అయితే లేవని చాలామంది సినీ ప్రియులు చెబుతున్నారు.

English summary
Adilabad MP Soyam Babu Rao warned Rajamouli for insulting Komaram Bheem character in his upcoming flick RRR, where Jr NTR who is playing the role of Komaram Bheem is seen wearing a muslim cap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X