వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చల్లటి కబురు ... భానుడి ప్రతాపం నుండి ఊరట ..నేడు, రేపు ఎండలకు బ్రేక్ ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

చల్లటి కబురు నేడు,రేపు ఎండలకు బ్రేక్ || Oneindia Telugu

భానుడి ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు , రేపు వర్షాలు కురుస్తాయని , భానుడి ఉగ్ర రూపం నుండి ఉపశమనం దొరుకుతుందని చెప్పింది . నిన్నటి దాకా ఎండల ధాటికి ఇబ్బంది పడిన ప్రజలు ఈ చల్లని కబురుతో ఊపిరి పీల్చుకోనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రజలు బయటకు వెళ్ళాలంటేనే భానుడి ధాటికి అల్లాడిపోయారు. ఇక వాతావరణ శాఖ కూడా మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లొద్దు అని సూచించింది. కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న వారికి వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది .

Cool news ..... today and tomorrow a great relief from hot summer ....

ఒడిశా నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోందని..వీటి వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించింది. మే 11వ తేదీ శనివారం, మే 12వ తేదీ ఆదివారం రాష్ట్రంలోని అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుండి 40 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.నేడు, రేపు వడగాల్పులు..!

గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!!గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!!

ఇక వర్షాలు కురిసిన చోట వాతావరణం చల్లబడుతుంది కానీ వర్షాలు లేని ప్రాంతాల్లో మాత్రం అధిక ఎండలు ఉండనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది . ఎండలతో కూడిన వడగాలులు వీస్తాయని కోస్తాంద్ర దక్షిణ ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తానికి వాతావరణ శాఖ చెప్పిన సమాచారం ప్రజలకు ఉపశమనం ఇవ్వనుంది.

English summary
A cool news to the people who are suffering by the hot summer. As it rains today and tomorrow the weather is going to change and gives a cool climatic condition . Till yesterday people are afraid to come out to withstand with the heat , the waether department's cool information made the people from a great relief of summer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X