వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాప్ కనెక్ట్’ 63వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం: డీజీపీ మహేందర్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలోని 63వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం చేరవేసేలా 'కాప్ కనెక్ట్' యాప్‌ను రూపొందించామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖ సాంకేతిక విభాగంలో ఇది ఒక విప్లవం లాంటిదని అన్నారు.

నూతనంగా రూపొందించిన ఈ 'కాప్ కనెక్ట్' యాప్‌ను సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయంలో ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పటికీ.. ఒక్కో గ్రూపులో 256 మందిని మించి సభ్యులుగా గ్రూపులో చేర్చలేకపోతున్నామని తెలిపారు.

 COP CONNECT mobile App for Telangana police launched

ఈ సమస్యను అధిగమించడానికే పోలీస్ శాఖ అంతర్గతంగా 'కాప్ కనెక్ట్‌' యాప్‌ను ఉపయోగించుకుంటుందని మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లోని పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరినీ ఒకే గ్రూపుగా ఏర్పాటు చేసే అవకాశం ఈ అప్లికేషన్‌లో ఉండటం వల్ల సమాచారం చేరవేత సులభమవుతుందని డీజీపీ తెలిపారు.

ఉన్నతాధికారుల ఆలోచనలు, అభిప్రాయాలను కిందిస్థాయి సిబ్బంది వరకు క్షణాల్లో చేర్చడంవల్ల క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు వస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

English summary
'COP CONNECT', a mobile app to support the professional communication and collaboration needs of the entire police department of Telangana, was launched here today by the DGP, M Mahendar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X