హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైన్ స్నాచర్‌లతో పోలీస్ దోస్తీ, సహకారం: పట్టుబడ్డ ఇరానీ గ్యాంగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు పోలీసులు అరెస్టు చేశారు. గొలుసు దొంగలకు సహకరిస్తున్న వారిలో ఓ కానిస్డేబుల్‌ను కూడా ఉండటం గమనార్హం. కాసులకు కక్కర్తి పడిన సదరు కానిస్టేబుల్ బాధత్యను విస్మరించి ఏకంగా స్నాచర్‌తో దోస్తి చేశాడు.

నిందితులను నేరాలు చేసేందుకు ప్రోత్సహించాడు. చివరికి యాంటీ చైన్ స్నాచింగ్ చేపట్టిన ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. సైబరాబాద్ యాంటీ చైన్ స్నాచింగ్ టీం ఆపరేషన్‌లో స్నాచింగ్‌లకు ప్రేరేపిస్తున్న ఆ పోలీసు కానిస్టేబుల్ బాగోతం బట్టబయలైంది.

ఐదుగురు స్నాచర్ల నుంచి సైబరాబాద్ పోలీసులు కేజీ 14 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

చైన్న స్నాచర్

చైన్న స్నాచర్

దుండిగల్ బహదూర్‌పల్లి ప్రాంతానికి చెందిన మోహన్ 2005లో సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నారాయణగూడ పీఎస్‌లో క్రైం కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నారాయణగూడ పోలీసులు ఇటీవలే స్నాచర్‌ను పట్టుకున్నారు. ఆ సందర్భంలో మోహన్‌కు స్నాచర్ ఫారూక్‌తో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహాన్ని అడ్డంపెట్టుకుని దొంగదారిలో డబ్బులు సంపాదించుకుందామనుకున్న ఫారూక్‌ను జైలులో మోహన్ ములాఖత్ తీసుకుని కలిశాడు.

చైన్న స్నాచర్

చైన్న స్నాచర్

అప్పుడు ఫారూక్ తనను బెయిల్‌పై తీసుకురావాలని కోరడంతో మోహన్ అతని విడుదలకు సహకరించాడు. ఆ తర్వాత ఫారూక్‌కు నారాయణగూడ పీఎస్‌లో స్వాధీనం చేసుకున్న గుర్తు తెలియని బైక్‌ను ఇచ్చి వాటిపై స్నాచింగ్‌లు చేసి బెయిల్ ఖర్చుతో పాటు చోరీ సొత్తులో వాటా ఇవ్వాలని పురమాయించాడు. అంతేకాకుండా ఫారూక్‌కు ఓ సెల్‌ఫోన్‌తో పాటు సిమ్ కార్డును అందించాడు.

చైన్న స్నాచర్

చైన్న స్నాచర్

ఫారూక్ విజ్ఞప్తి మేరకు మరో నిందితుడు మహ్మద్ అహ్మద్‌ను కూడా మోహన్ బెయిల్ పై విడిపించాడు. ఇలా మోహన్ సహకారంతో ఫారూక్, అహ్మద్ మల్కాజిగిరి, నాచారం, మేడిపల్లి ప్రాంతాల్లో స్నాచింగ్‌లకు పాల్పడి దొరికిన సొత్తును ముగ్గురు సమానంగా పంచుకున్నారు. యాంటీ ఛైన్ స్నాచింగ్ టీం సహకారంతో ఫారూక్, అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

చైన్న స్నాచర్

చైన్న స్నాచర్

ఈ ముగ్గురు నుంచి 10 తులాల బంగారంతో పాటు ఓ బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన చైన్ స్నాచర్ వసీమ్ ఉస్మాన్ సయ్యిద్ పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడు. అతనిని ఇరానీ స్నాచర్ గ్యాంగ్ సభ్యుడిగా యాంటీ చైన్ స్నాచింగ్ టీం గుర్తించింది. ఈ సమాచారంతో మల్కాజిగిరి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం 22 కేసుల మిస్టరీ వీడింది.

 చైన్న స్నాచర్

చైన్న స్నాచర్

ఉస్మాన్ తన అనుచరుడు హైదర్‌తో కలిసి సైబరాబాద్‌తో పాటు పూణే, షిర్డీ, అహ్మద్‌నగర్, నాసిక్, చెన్నైల్లో స్నాచింగ్‌లు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అతని నుంచి 43.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ కూడా తన వ్యాపారంలో నష్టాలు వచ్చి... అప్పులు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. అతను 19 కేసుల్లో నిందితుడు. అతనిని కూడా అరెస్టు చేసి 60 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

English summary
The Cyberabad Police on Thursday arrested three notorious chain snatching gangs, including a constable from Hyderabad, who were involved in nearly 46 snatching cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X