వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్, అభిమానులపై కేసు: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదలీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ వీడియోలను పవన్ అభిమానులు మార్ఫింగ్ చేసి ఛానల్ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని, పవన్ స్వయంగా ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఏబీఎన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీసీఎస్ నుంచి శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదలీ చేశారు.

Cops file case against Pawan Kalyan and fans

పవన్ కళ్యాణ్ ట్వీట్

తనకు ఎంతో ఇష్టమైన రచయిత శ్రీ శేషేంద్ర పుస్తకం ఆధునిక మహాభారతం నుంచి కొన్ని ఫంక్తులు అంటూ ఓ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. 'ఇరవై అశ్రువుల్ని రాల్చడానికి ఇరవై అక్షరాలు చాలవు, ఈ అక్షరాలు మీద గద్దలు వాలవు..' అనే ఫంక్తుల్ని పొందుపర్చారు.

పవన్ కళ్యాణ్‌కు విగ్రహం

పవన్‌పై ఆయన అభిమానులు ఎంతటి అభిమానం కనపరుస్తారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ అభిమాని ఏకంగా పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏడున్నర అడుగుల నిలువెత్తు విగ్రహం నెలకొల్పాడు.

తెలుపు రంగు ప్యాంటు, ఖాకీ రంగు లాల్చీతో ఉన్న ఈ విగ్రహం మెడలో జనసేన పార్టీ కండువా, నడుముకు గబ్బర్ సింగ్ టవల్ చుట్టి ఉన్నాయి. విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగలేదు. ఈ విగ్రహాం ఫొటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
CCS transfer case, which is against Pawan Kalyan and fans, to Banjara Hills Police Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X