హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ నిట్‌లో ఎంసీఏ: సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అహోరాత్రులు కష్టపడినా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికకాకపోవడం ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఉన్మాదిగా మార్చేసింది. తల్వార్‌తో తల్లిదండ్రులు సహా రోడ్డుమీద దొరికినోళ్లను దొరికినట్లుగా తల్వార్‌తో గాయపరుస్తూ బీభత్సం సృష్టించి చివరకు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. కరీంనగర్‌లోని కమాన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

లక్ష్మినగర్‌కు చెందిన అవతార్‌సింగ్, సత్వంత్‌బేబికౌర్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయ. కుమారుడు బల్వీందర్‌సింగ్ (26) బెంగుళూరులోని ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఏడాదికి రూ.18 లక్షల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగానికి కనీసం సెలవు కూడా పెట్టలేదని తెలిసింది.

కరీంనగర్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి వరకు చదివిన బల్వీందర్‌సింగ్ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్‌లోనూ టాప్‌ర్యాంకు సాధించాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐసెట్‌లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించి వరంగల్ నిట్‌లో ఎంసీఏ చేశాడు. అనంతరం బెంగుళూరులోని ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సివిల్స్ సాధించాలనేది అతని లక్ష్యం. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్నాడు. ఇటీవలి వెలువడి సివిల్స్ నోటిఫికేషన్ తొలిదశ పరీక్ష ప్రిలిమ్స్‌లో నెగ్గకపోవడంతో నిరాశకు గురయ్యాడు. వారం కిందట కరీంనగర్‌కు వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

మంగళవారం ఉదయం ఆరున్నర సమయంలో బల్వీందర్ తల్వార్‌తో తల్లిదండ్రులపై దాడికి యత్నించారు. వారు రోడ్డుపైకి పరుగులు తీశారు. వాళ్లను తరుముతూ వచ్చిన బల్వీందర్ రోడ్డు మీద దొరికినవాళ్లను దొరికినట్లు తల్వార్‌తో దాడి చేయడం ఆరంభించాడు. దాంతో భయానక వాతావరణం నెలకొంది.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

రోడ్డుపై ఉన్న కొంద రు ఆపబోగా దాడికి ప్రయత్నించడంతో తప్పుకున్నారు. అటుగా వచ్చిన ఆటోడ్రైవర్ శ్రీమన్నారాయణ అతడిని ఆపబోగా దాడి చేయడంతో గాయపడ్డాడు. కనిపించిన వాహనాల అద్దాలను బల్వీందర్ ధ్వంసం చేశాడు. అతని వీరంగం గంటపాటు కొనసాగింది. వీధిలో ఎవరూ బయటికి రావడానికి సాహసించలేదు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

అంతలోనే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ అలీ అతడిని అదుపుచేసేందుకు ప్రయత్నించగా తల్వార్‌తో దాడిచేశాడు. అలీ చిటికెన వేలు తెగిపోవడంతో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య బల్వీందర్‌ను బంధించే ప్రయత్నం చేశాడు. మల్లయ్యపైనా దాడి చేయడంతో చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడింది.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

దాన్ని బల్వీందర్ తీసుకునేందుకు యత్నిస్తుండగా, అప్పుడే అక్కడికి చేరుకున్న వన్‌టౌన్ సీఐ విజయసారథి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చడంతో బల్వీందర్ కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బల్వీందర్ దాడిలో తల్లిదండ్రులు అవతార్‌సింగ్, సత్వంత్‌బేబికౌర్, హెడ్‌కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ మీర్ అలీ, ఆటో డ్రైవర్ శ్రీమన్నారాయణ, అల్వాల్‌కు చెందిన కీర్తన, ఆమె తండ్రి జయకర్, వినయ్‌కుమార్‌తోపాటు మరికొందరికి గాయలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బల్వీందర్‌సింగ్ మృతి చెందాడు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

కాళ్లపై కాల్పులు జరిపి అదుపుచేయాల్సి ఉండగా, పక్కటెకముల భాగంలో కాల్పులు జరపడంతో చనిపోయాడని, కాల్పులు జరిపిన సిఐపై హత్య కేసు నమోదు చేయాలంటూ మృతుడి బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

బల్వీందర్ మృతి విషయాన్ని తెలుసుకొని ఆ వర్గానికి చెందిన నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శాంతిభద్రతలు అదుపుతప్పే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కరీంనగర్, పెద్దపల్లి, హుజూరాబాద్ సబ్ డివిజన్ల డీఎస్పీలు సిబ్బందితో జిల్లా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

డీఐజీ మల్లారెడ్డి కరీంనగర్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం దవాఖానకు వెళ్లగా బల్వీందర్ బంధువులు, స్నేహితులు ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ అలీని పరామర్శించారు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

ఈ ఘటనపై మెజిస్ట్రీరియల్ విచారణ జరుపాలని నిర్ణయించడంతో ఆర్డీవో సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేపట్టారు. బల్వీందర్ వీరంగం మొత్తాన్ని పోలీసులు వీడియోలో చిత్రీకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మేయర్ రవీందర్‌సింగ్ జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

సైకోగా మారిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే

English summary
A psycho created hulchul in Karimnagar. Bablu, who is a resident of Lakshminagar, attacked as many as 20 persons with a 'talwar' on Tuesday morning. He also bit the finger of Karimanagar I-town head constable Ali, who reached the spot after learning about his attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X