వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్తులో అంతా సుఖమే అన్నది: రాజేష్, గౌరవం కోసమూ స్వాతి ప్లాన్, కనిపించని పశ్చాత్తాపం

|
Google Oneindia TeluguNews

నాగర్‌కర్నూలు/హైదరాబాద్: సుధాకర్ రెడ్డి హత్య కేసులో భార్య స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అంతకుముందు నాగర్ కర్నూలు పోలీసులు సీన్ ఆఫ్ ఎఫెన్సును రీక్రియేట్ చేశారు.

చదవండి: భర్తను రోకలిబండతో కొట్టి, రాజేష్‌కు సైగ చేసి: స్వాతి కిరాతకం, 'జైలు నుంచి వచ్చినా నో'

రాజేష్‌ను ఫతేపూర్ అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అక్కడ సుధాకర్ రెడ్డిని ఎలా దహనం చేసిన విషయాన్ని రాబట్టారు. ఆ ప్రాంతంలో హత్యకు ఉపయోగించిన గడ్డపార, చున్నీ, ప్లేట్, పెట్రోలు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఎన్నో విషయాలను రాబట్టారు.

చదవండి: గుట్టువిప్పిన రాజేష్, బలమైన సాక్ష్యాలు: 'అలాంటి స్వాతి ఇలా చేసిందా'

విలేకరుల ప్రశ్నకు రాజేష్ సమాధానం

విలేకరుల ప్రశ్నకు రాజేష్ సమాధానం

ముఖం కాలుతున్నపుడు బాధగా అనిపించిందని, ఇప్పడు కొంత బాధ అనుభవిస్తే, భవిష్యత్తులో అంతా సుఖాన్నే పొందవచ్చని స్వాతి చెప్పిందని, ఇద్దరం కలిసే సుధాకర్ రెడ్డిని హత్య చేశామని, భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తాగి వచ్చి కొడుతున్నాడని తనతో చెప్పి బాధపడేదని, మనమిద్దరం సుఖంగా ఉండాలంటే సుధాకర్ రెడ్డి మధ్యలో ఉండరాదని స్వాతి చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డామని రాజేష్ చెప్పాడు. వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకు రాజేష్ సమాధానం అది.

సుధాకర్ రెడ్డికి స్వాతికి బావ, ప్రేమించి పెళ్లాడింది

సుధాకర్ రెడ్డికి స్వాతికి బావ, ప్రేమించి పెళ్లాడింది

బండపల్లికి చెందిన స్వాతికి సుధాకర్ రెడ్డి వరుసకు బావ అవుతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగారు. సంసారం హాయిగా సాగుతున్న సమయంలో రాజేష్ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సుధాకర్ రెడ్డి లేని సమయంలో స్వాతి ఆ సమాచారం ఇస్తే రాజేష్‌ ఇంటికి వచ్చేవాడు. శారీరకంగా కలుసుకుంటూ, అవసరాలకు డబ్బు తీసుకుంటూ రాజేష్‌ బలాదూర్‌గా తిరిగేవాడు.

ఊరికేనే చంపేస్తే అనుమానమని, ఆస్తి-గౌరవం పోకుండా

ఊరికేనే చంపేస్తే అనుమానమని, ఆస్తి-గౌరవం పోకుండా

భర్త సుధాకర్ రెడ్డిని ఊరికేనే చంపేస్తే అనుమానం వస్తుందని, స్వాతి తన భర్త స్థానంలోకి రాజేష్‌ను తీసుకు రావాలనుకుంది. భర్త స్థానంలో రాజేష్‌ను తీసుకొస్తే అనుభవిస్తున్న ఆస్తి చేజారకుండా సమాజంలో గౌరవానికి భంగం లేకుండా బతకొచ్చని భావించారు.

మీరే పడ్డారంటూ సర్ది చెప్పింది

మీరే పడ్డారంటూ సర్ది చెప్పింది

హత్యకు ముందు రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో రాజేష్ ఇంట్లో ఉన్నప్పుడు స్వాతి లైట్ బంద్ చేసింది. రాజేష్ ఇనుపరాడ్డుతో కొట్టాడు. రాజేష్‌ను వెళ్లగొట్టింది. మీరే మంచంపై నుంచి పడ్డారంటూ భర్తకు సర్ది చెప్పి బంధువుతో ఆసుపత్రికి పంపించింది. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన సుధాకర్ రెడ్డి, బంధువు అరవింద్ రెడ్డి ఇంట్లో పడుకున్నారు. మరుసటిరోజు తెల్లవారుజామున అరవింద్ రెడ్డిని పంపించి, రాజేష్‌ను మళ్లీ పిలిపించి, ఇద్దరు కలిసి హత్య చేశారు.

స్వాతి ముఖంలో కనిపించని పశ్చాత్తాపం

స్వాతి ముఖంలో కనిపించని పశ్చాత్తాపం

ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను అడ్డు తొలగించుకున్న స్వాతిని శుక్రవారం కోర్టుకు తీసుకు వచ్చిన సమయంలో ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆమెను మహిళా జైలు నుంచి ఆర్టీసీ బస్సులో తీసుకు వచ్చారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత తిరిగి అదే బస్సులో తిసుకు వెళ్లారు. గంటన్నరకు పైగా స్వాతి కోర్టులో ఉంది.

English summary
As part of investigations in the Sudhakar Reddy murder case, a police team took the accused Swathi and Rajesh to Nawabpet forest area to reconstruct the crime scene. Rajesh told interrogators that he joined Swathi in the gruesome act only at the insistence of the wife of the deceased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X