• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా ... చిన్నోళ్ళ నుండి వృద్ధుల దాక స్టెప్పులు .. సాంగ్ వైరల్

|

ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే పాట.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ ల నుండి అసలు ఏ మాత్రం డ్యాన్స్ రాని వారి వరకు వేసే స్టెప్పులు కూడా ఆ పాటకే . కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని చెప్పే ఓ పాట ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత పాటించాలని , లాక్ డౌన్ నియమాలు అనుసరించాలని , సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సిబ్బంది పలు సూచనలు చేస్తున్నా పట్టించుకోని చాలా మంది ఈ పాటకు అట్రాక్ట్ అవుతున్నారు .

గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారం .. మెనూ ఇదే

కరోనా అవగాహనలో కీలక భూమిక పోషిస్తున్న సాంగ్

కరోనా అవగాహనలో కీలక భూమిక పోషిస్తున్న సాంగ్

ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వీలైనంతలో సమాజానికి కొన్ని రోజులు దూరంగా ఉండాలని లాక్ డౌన్ విధించారు . అయినా చాలా మంది లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించి బయట తిరుగుతున్నారు . ఇక శానిటైజర్లు వాడాలని, దగ్గు, తుమ్ము వచ్చినపుడు మోచేతిని అడ్డంగా పెట్టుకోవాలని చెప్తున్నా, మాస్కులు ధరించాలని సూచనలు చేస్తున్నా పట్టించుకున్న వాళ్ళు కొందరే . కానీ చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా అని చేసిన ఒక సాంగ్ దెబ్బకు అందరూ నో షేక్ హ్యాండ్ అంటున్నారు. బయట తిరగొద్దని ఫీల్ అవుతున్నారు. ఇక ఈ పాటకు డ్యాన్స్ రాని వాళ్లు సైతం స్టెప్పులేస్తున్నారు .

సరళమైన భాషలోనే పాట రూపంలో అవగాహన

సరళమైన భాషలోనే పాట రూపంలో అవగాహన

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు అందరికి అర్ధమయ్యే సరళమైన భాషలో పాట రూపంలో చేశారు .షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, వీలైనంతలో ఇల్లు దాటి కాలు బయట పెట్టొద్దని తమదైన శైలిలో చెప్పారు. దానికి సంబంధించిన పాట, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా, కాళ్లు కూడా మొక్కుతా.. అడుగు బయట పెట్టకురా, ఉన్నకాడే ఉండరా.. గంజి తాగి పండరా ..మంచి రోజులొచ్చెదాక నిమ్మలంగ ఉండరా.. అంటూ పాడిన పాట ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఉర్రూతలూగిస్తోంది.

చిన్నోళ్ళ నుండి ముసలోళ్ళ దాకా స్టెప్పులే స్టెప్పులు

చిన్నోళ్ళ నుండి ముసలోళ్ళ దాకా స్టెప్పులే స్టెప్పులు

ఇక చిన్న పిల్లవాడి నుండి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ పాటకు కొరియోగ్రఫీ చెయ్యటం మాత్రం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్,ఇలా ఏది ఓపెన్ చేసినా సరదాగా ఉండే ఈ పాటకు భిన్నమైన డ్యాన్స్ వివిధ వర్గాల నుండి కనిపిస్తుంది. కరోనా బారిన పడకుండా బతికుంటే చాలు ఎలాగో ఒకలా జీవనం సాగిస్తామన్న అర్ధం ఈ పాటలో వ్యక్తం అవుతుంది . సమాజం అందరూ ఆలోచించేలా, సాధారణ జనానికి ఈజీగా అర్థమయ్యేలా రాసిన ఈ పాట పదే పదే వింటున్న వారు ఒక సందర్భంలో కాకున్నా ఒకప్పుడైనా ఆలోచిస్తారనే భావన కలుగుతుంది .

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి స్పూర్తినిస్తున్న సాంగ్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి స్పూర్తినిస్తున్న సాంగ్

ఇక పోలీసులు , పలు స్వచ్చంద సంస్థల వాళ్ళు కూడా ఇదే పాటకు స్టెప్పులేసి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. ఇక ఈ పాటతో జోరుగా కరోనాపై అవగాహనకు ప్రచారం కూడా సాగుతుంది . బుడి బుడి అడుగుల బుడతడు, వచ్చీ రాని మాటలతో ఈ పాట పాడుతూ వేస్తున్న స్టెప్పులు టిక్ టాక్ వీడియోలలో హల్చల్ గా మారాయి. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనాపై సాగుతున్న పోరాటంలో ఈ పాట తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి స్పూర్తిని ఇచ్చిందని చెప్పొచ్చు .

English summary
A song that says personal hygiene is so important in the wake of the corona outbreak has now become viral . Many of the central and state governments medical staff have been advised to follow personal hygiene, lock-down rules and social distance but people who are negleting the suggestions are now realised with the song what to do and what not to do at this corona lock down time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more