• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనో,బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స ఉచితంగా చేయాలి.!గవర్నర్ కు విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ ముఖ్య నేతలు.!

|

హైదరాబాద్ : దేశంలో కరోనో వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ వైక్సిన్ వేయాలని, రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేసి వాక్సి నేషన్ వేగం పెంచాలని, రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స ఉచితంగా చేయాలని, ఇప్పటి వరకు అధికంగా ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించిన డబ్బులను వెనక్కి తీసుకుని బాధితులకు అందించాలని డిమాండ్ చేస్తూ టీ కాంగ్రెస్ ముఖ్యనేతలు గవర్నర్ ను కలిసి రాష్ట్రపతి పేరున ఉన్న వినతి పత్రం అందజేసారు. ఈ సందర్బంలో కరోనా మహమ్మారి వల్ల నెలకొన్న భయంకర పరిస్ధితులను, పేద మద్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలను టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

రెండవ దశను అధిగమంచడంలో మోదీ విఫలం.. ఇక మూడో దశను ఎలా ఎదుర్కొంటారన్న టీపీసిసి నేతలు..

రెండవ దశను అధిగమంచడంలో మోదీ విఫలం.. ఇక మూడో దశను ఎలా ఎదుర్కొంటారన్న టీపీసిసి నేతలు..

కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలంటే టీకా ఒక్కటే మార్గమమని, మోడీ ప్రభుత్వం టీకా విధానాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యతను విస్మరించిందని టీ కాంగ్రెస్ మండిపడింది. టీకాల సేకరణ, వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డిజిటల్ డివైడ్ ను సృష్టించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తద్వారా టీకాలు వేసే వేగం తగ్గిపోయింది. ఒకే వ్యాక్సిన్ కోసం ధరల వ్యత్యాసాలతో స్లాబ్‌లు రూపొందించి ఉద్దేశపూర్వకంగా అవకతవకలకు పాల్పడిందని ధ్వజమెత్తారు.

రోజుకు కోటి టీకాలు ఇవ్వండి.. కేంద్రానికి టీ కాంగ్రెస్ లేఖ..

రోజుకు కోటి టీకాలు ఇవ్వండి.. కేంద్రానికి టీ కాంగ్రెస్ లేఖ..

ఇతర దేశాలు 2020 మే నుండి వ్యాక్సిన్ల కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభిస్తే, మన మోడీ ప్రభుత్వం దేశంలో అవసరమైనన్ని టీకాలు ఆర్డర్ ఇవ్వడంలో విఫలమైందని, మనకు అందిన సమాచారం ప్రకారం మోడీ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దేశంలోని 140 కోట్ల జనాభాకు 39 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను మాత్రమే ఆర్డర్లు ఇచ్చాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి దారుణంగా పంజావిసురుతోందని, అనేక మంది అభాగ్యులు ప్రాణాలు వదిలేస్తున్నారని, ఇందుకు కేంద్ర ప్రభుత్వానిది బాద్యత కాదా అని తెలంగాణ కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తోంది.

  Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu
  కరోనావైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్ వ్యాధిని రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చాలి.. టీ సర్కార్ కళ్లు తెరవాలన్న కాంగ్రెస్..

  కరోనావైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్ వ్యాధిని రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చాలి.. టీ సర్కార్ కళ్లు తెరవాలన్న కాంగ్రెస్..

  ఇక తెలంగాణలో కరోనావైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్ వ్యాధిని రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ చేస్తున్న విజ్ఞప్తులను తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రయివేట్ ఆసుప్రుల్లో బిల్లులు కట్టలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనేక సమస్యల్లో చక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇదే అంశంలో గవర్నర్ జోక్యం చేసుకుని ప్రభుత్వానికి తగు సూచన చేయలని కాంగ్రెస్ నేతలు కోరారు.
  ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ లు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ లు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

  English summary
  The T Congress has demanded free vaccination to curb the spread of coronavirus in the country, to vaccinate one crore people per day and speed up the vaccination, and free treatment of corona and black fungus in the state.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X