• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం.! ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తేసాయా..? చేతులెత్తేసాయా..?

|

అమరావతి/హైదరాబాద్ : జరాగాల్సిందంతా జరిగిపోతోంది. ఏదైతే జరక్కూడదు అనుకున్నామో ఇప్పుడు అదే జరుగుతోంది. మొన్నటి వరకూ తీవ్ర ప్రతాపం చూపించి చల్లగా జారుకున్న ఎండల స్ధానంలో కరోనా వైరస్ ప్రతాపం కొనసాగిస్తోంది. అంతం కాదు ఆరంభం మాదిరిగా కరోనా రోజుకో ప్రాంతంలో విజృంభిస్తోంది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న గ్రీన్ జోన్లలో కూడా కరోనా రెచ్చిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగామనే భావనతో చాలా వరకు ఆంక్షలను సడలించారు. ఎన్నో కఠిన నిర్ణయాలను ఎత్తేసారు. ఆంక్షలు ఎత్తేయడంతోనే కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని, ఇప్పుడు వైరస్ ను నియంత్రించడంలో తెలుగు ప్రభుత్వాలు చేలులెత్తేసాయనే చర్చ జరుగుతోంది.

కరోనా కాలంలో కొత్త స్టార్టప్ .. ఇక చావు తిప్పలకు చెక్ ..ఆన్ లైన్ ద్వారా అంత్యక్రియలు

 తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా.. కార్యాచరణ దిశగా ప్రభుత్వాలు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా.. కార్యాచరణ దిశగా ప్రభుత్వాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు మార్చి రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే తొంబై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవి 87 కాగా, 12 కేసులు వలస కూలీలకు సోకిన పాజిటీవ్ కేసులు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో ఏడు, మహబూబ్‌ నగర్‌లో ఒకటి, మేడ్చల్‌ జిల్లాలో మూడు, జగిత్యాల జిల్లాలో ఒకటి, నల్గొండ జిల్లాలో రెండు,మంచిర్యాల ఒకటి, సంగారెడ్డి ఒకటి, సిద్దిపేటలో ఒక కేసు నమోదైంది.

 తెలంగాణలో కొత్తగా 94 పాజిటివ్ కరోనా కేసులు.. వైరస్ ప్రభావంతో నలుగురు మృతి..

తెలంగాణలో కొత్తగా 94 పాజిటివ్ కరోనా కేసులు.. వైరస్ ప్రభావంతో నలుగురు మృతి..

మంగళవారం నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2891కి చేరింది. కేసుల ఉద్రితి ఇదే విధంగా కొనసాగితే 3000వేల మార్కును దాటుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇక బుదవారం ఉదయం కరోనా బారినపడి నలుగురు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 92కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1526 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేయగా, 1273 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 ఆంధ్రప్రేదేశ్ లో పంజా విసురుతున్న కరోనా.. అయోమయంలో యంత్రాంగం..

ఆంధ్రప్రేదేశ్ లో పంజా విసురుతున్న కరోనా.. అయోమయంలో యంత్రాంగం..

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసులు ప్రభావం తీవ్రంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఎనభై రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరూ కరోనా పాజిటీవ్ కేసులు 3,200కి చేరాయి. అలాగే మంగళవారం 40 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 927 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా మంగళవారం రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొంది. కాగా రోజురోజుకు పెరుగుతున్న కేసుల ఆందోళకరంగా మారుతున్నాయని, వచ్చే వర్షా కాలంలో కరోనా వైరస్ ఇంకెంత ఉగ్రరూపం చూపిస్తోందనని ప్రభుత్వ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

  Lockdown 5 : Restaurants And Hotels To Reopen From June 8 In Andhra Pradesh
   కరోనా కట్టడికి మరోసారి కఠిన ఆంక్షలు తప్పవా..? వ్యూహ రచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..

  కరోనా కట్టడికి మరోసారి కఠిన ఆంక్షలు తప్పవా..? వ్యూహ రచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం..

  అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాదఘంటికలను మోగిస్తోంది. ఏకంగా రెడు లక్షల కేసులను దాటి కరోనా బాదిత దేశాల్లో ప్రపంచంలో నాలగో స్ధానానికి భారత దేశం ఎగబాకింది, దీంతో ఆంక్షల అమలు అంశంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా ఛిన్నాభిన్నమైన వ్యవస్తలను, ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టేందుకే ఆంక్షలు ఎత్తేపసామని, ఇదే అదునుగా కరోనా పంజా విసురుతోందని కేంద్రం అంచనా వేస్తోంది. కరోనా కట్టడికోసం మరోసారి కేంద్రం కఠిన ఆంక్షల అమలు దిశగా చర్యలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది, కరోనా వైరస్ ను సంపూర్ణంగా ఎదుర్కోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయలేదనే సంకేతాలు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  English summary
  The two Telugu states have relaxed most of the restrictions on the idea that they have controled the coronavirus.There is debate that the corona cases have increased significantly since the sanctions were lifted and now the Telugu governments have taken up the task of controlling the virus.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X