వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ .. మహిళలకు పెరిగిన గృహ హింస

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతున్న సమయంలో దోపిడీలు, దొంగతనాలు , రోడ్డు ప్రమాదాలు , అత్యాచారాలు , హత్యలు దాదాపుగా లేవనే చెప్పాలి . ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ఇళ్లలోనే ఉన్నారని భావిస్తున్న వాళ్ళు తప్పులో కాలేసినట్టే . మహిళలు ఇళ్ళలో ఊహించని విధంగా లాక్ డౌన్ ప్రభావంతో గృహ హింస అనుభవిస్తున్నారు . ఇక పోలీస్ స్టేషన్ల పరిధిలో లాక్ డౌన్ విధించిన నాటి నుండి ఇప్పటి వరకు గృహహింస కేసులు విపరీతంగా పెరిగిపోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు .

సాధారణ రోజుల్లో కంటే లాక్‌డౌన్‌ లో ఎక్కువగా నమోదైన గృహహింస కేసులు

సాధారణ రోజుల్లో కంటే లాక్‌డౌన్‌ లో ఎక్కువగా నమోదైన గృహహింస కేసులు

సాధారణ రోజుల్లో కంటే లాక్‌డౌన్‌ లో నమోదైన గృహహింస ఘటనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి . అందరూ ఇళ్లకే పరిమితం కావటం, ఒకపక్క పనుల్లేక ,పైసల్లేక ఇబ్బంది పడుతున్న మగవారి చిరాకు భరించటం , పిల్లల అల్లరిని సహించటం , వారికి కావాల్సింది చేసి పెట్టటం ,అందరికి వండి వార్చటం , కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో అందరికీ సేవలు చెయ్యటం వెరసి స్త్రీలు యంత్రాలలా మారిపోయారు . పని ఒత్తిడితో కొందరు.. వర్క్‌ ఫ్రం హోమ్‌ టెన్షన్‌తో కొందరు, లిక్కర్ అలవాటై మద్యం దొరకక మరికొందరు వారి కోపం అంతా ఇంట్లో భార్యలపై చూపిస్తున్నారు .

ఇంటెడు చాకిరీ చేస్తున్నా మహిళలపై ఆగని హింస

ఇంటెడు చాకిరీ చేస్తున్నా మహిళలపై ఆగని హింస

ఇక ఇంటెడు చాకిరీతో నాలుగు గోడల మధ్యే మహిళలు హింసను మౌనంగా భరిస్తున్నారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే పరిస్థితి లేకపోవటంతో భరించలేని స్థితిలో డయల్‌ 100 లేదా మహిళల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు అదేపనిగా ఫోన్లు చేస్తున్నారు. తమను గృహ హింస నుండి కాపాడమని అడుగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కొందరు కుటుంబాల్లో శాడిస్ట్ భర్తల ప్రవర్తనతో , అలాగే అత్త మామల వేధింపులతో నరకం అనుభవిస్తున్నారు.

 మానసిక వేదనలో మహిళలు .. పెరుగుతున్న గృహ హింస ఫిర్యాదులు

మానసిక వేదనలో మహిళలు .. పెరుగుతున్న గృహ హింస ఫిర్యాదులు

లాక్‌డౌన్‌ తో మద్యం షాప్‌లు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయటం కూడా పరోక్షంగా మహిళల మీద ప్రభావం చూపిస్తుంది . రోజూ మద్యం తాగితేగానీ ఉండలేని మగాళ్లకు మద్యం దొరక్క ఆ కోపం భార్య మీద చూపించి భార్యలను వేధిస్తున్నారు. కరోనా భయంతో ఇంట్లోకి పనివాళ్లను అనమతించని వారు లేకపోలేదు. దీంతో ఇంటెడు చాకిరీ చెయ్యలేక మహిళలు తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. ఫలితంగా గృహ హింస ఫిర్యాదులు పెరుగుతున్నాయి. భార్యాభర్తలు నెల రోజులుగా ఇంట్లోనే ఉండటం కూడా కొందరి కాపురాల్లో మనస్పర్ధలకు కారణంగా మారుతుంది. ఏది ఏమైనా లాక్ డౌన్ తో మహిళలు చెప్పుకోలేని హింసకు లోనవుతున్నారు.

English summary
The number of incidents of domestic violence recorded on lockdown is much higher than on normal days. Everyone is confined to homelessness, men's irritability who are not working . Some with work from home work stress. they are harassing women in the home .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X