వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్ట్ లకు కరోనా కష్టాలు, చావుబతుకుల మధ్య మావో కీలక నేత హిడ్మా ? పోలీసులకు ఇదే అడ్వాంటేజ్ !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి అడవులను సైతం వదలడం లేదు. ప్రస్తుతం దండకారణ్యంలో కరోనా మహమ్మారి మావోయిస్టు పార్టీని సైతం వణికిస్తోంది. ఇటీవల మావోయిస్టులు చత్తీస్గడ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలలో చాపకింద నీరులా కార్యకలాపాలను విస్తరిస్తూ తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన మెరుపు దాడి చేసి షాక్ ఇచ్చారు. గతంలో సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని టెర్రాం వద్ద మావోయిస్టులు జరిపిన వ్యూహాత్మక దాడిలో 24 మంది జవాన్ల మరణంతో ప్రతీకారం తీర్చుకోవటానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి . ఇప్పటికీ అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.

Recommended Video

COVID Third Wave | Easing COVID 19 Curbs | Oneindia Telugu
దండకారణ్యానికి పాకిన కరోనా.. కీలక నేతలు మృతి

దండకారణ్యానికి పాకిన కరోనా.. కీలక నేతలు మృతి

అటు మావోయిస్టులకు ఇటు పోలీసులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో కరోనా మహమ్మారి మావోయిస్టు పార్టీని కుదేలు చేస్తోంది. దండకారణ్యంలో కరోనా మహమ్మారి కారణంగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు కరోనా కాటుకు బలయ్యారు. నిన్నటికి నిన్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నారాయణ అలియాస్ హరి భూషణ్ , ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు భారతక్క అలియాస్ సారక్క కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందినట్టు మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ గురువారం ధ్రువీకరించారు.

మావోయిస్ట్ గెరిల్లా హిడ్మా కు కరోనా

మావోయిస్ట్ గెరిల్లా హిడ్మా కు కరోనా

దీంతో మావోయిస్టు పార్టీ నేతలు కరోనాతో బాధపడుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇది పోలీసులకు అడ్వాంటేజ్ గా మారింది. ఇక తాజాగా చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులకు టార్గెట్ గా ఉన్న ,ఛత్తీస్గఢ్ ‌లోని బీజాపూర్‌లో ఆకస్మిక మెరుపు దాడికి నాయకత్వం వహించిన మావోయిస్టు కమాండర్ మాద్వి హిడ్మా, కరడుగట్టిన మావోయిస్టు గెరిల్లా, అతన్ని పట్టుకుంటే 25లక్షల రూపాయల రివార్డు ఉన్న విషయం తెలిసిందే .మావోయిస్టు కీలక నేత మాద్వి హిడ్మా కూడా కరోనా బారిన పడ్డారని, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అని ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ లోని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు.

లొంగిపోవాలని పోలీసుల పిలుపు .. సంతల వల్లే మావోలకు కరోనా

లొంగిపోవాలని పోలీసుల పిలుపు .. సంతల వల్లే మావోలకు కరోనా

అతను లొంగిపోతే చికిత్స అందించి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా వారు ప్రకటిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఇంకా ఎంతమంది మావోయిస్టులకు కరోనా సోకిన ఉంటుందన్న చర్చ కూడా పోలీసులలో జరుగుతోంది. దంతేవాడ ,బీజాపూర్, బస్తర్, గడ్చిరోలి తదితర జిల్లాలలోని మావోయిస్టు దళాలు కూడా వైరస్ వ్యాపించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల సంఖ్యలో మావోలు కరోనా బారిన పడ్డారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారాంతపు సంతాల నుండి గిరిజనులకు , గిరిజనుల నుండి మావోలకు కరోనా వ్యాప్తి జరిగినట్టు అనుమానం వ్యక్తం అవుతుంది.

మావోలను పట్టుకునేందుకు పోలీసుల యత్నం .. కరోనాతో మావోయిస్ట్ పార్టీకి నష్టం

మావోలను పట్టుకునేందుకు పోలీసుల యత్నం .. కరోనాతో మావోయిస్ట్ పార్టీకి నష్టం

ఇక ఇదే సమయంలో మావోయిస్టులను పట్టుకోవడానికి, వారికి వారి లొంగిపోయేలా చేయడానికి పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మావోయిస్ట్ కీలక నేతల కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇవ్వటం , వారికి సహాయ సహకారాలు అందించే ఆదివాసీలపై నిఘా పెట్టటం, వారికి గ్రామాలలోని ఆర్ఎంపీల సహకారం అందకుండా జాగ్రత్త పడుతున్నారు. లొంగిపోతే వైద్యం చేయిస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు.
ఏది ఏమైనా తమ ప్రాబల్యాన్ని చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న మావోయిస్ట్ పార్టీ కి కరోనా తీవ్ర నష్టం చేకూరుస్తుంది.

English summary
Corona is creating panic the Maoist party during the Cold War between the Maoists and the police. Top Maoist leaders haribhushan , bharatakka have been died due to the Corona and Madhvi Hidma, a key Maoist leader, was also infected with corona.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X