వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్ ... రాములోరి కళ్యాణం టీవీల్లోనే... పూజలు ఇళ్లలోనే ..

|
Google Oneindia TeluguNews

ఈ రోజు శ్రీరామ నవమి.. లోక కళ్యాణం కోసం వాడవాడలా అట్టహాసంగా సీతారాముల కళ్యాణం జరిపించి ప్రజలంతా కూడి సంతోషంగా జరుపుకునే పండుగ . అలాంటి పండుగ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు . శ్రీరామనవమి వస్తుంది అంటే దేశంలో పండగ వాతావరణం నెలకొంటుంది. వాడవాడలా రాములోరి కళ్యాణానికి పందిళ్ళు వేసి హడావిడి కొనసాగుతుంది . సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ప్రతి గ్రామం సిద్ధం అవుతుంది. పల్లెలే కాదు పట్టణాలు , నగరాల్లో కూడా దేవాలయాల వద్ద పందిళ్లు వేస్తారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం చూతము రారండి అంటూ పాటలు స్వామి కళ్యాణానికి ఆహ్వానం పలుకుతాయి .

లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ శ్రీరామనవమి .. మంత్రి హరీష్ ఏం చెప్పారో తెలుసా !!లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ శ్రీరామనవమి .. మంత్రి హరీష్ ఏం చెప్పారో తెలుసా !!

 శ్రీరామనవమికి కనిపించని హడావిడి .. లాక్ డౌన్ ప్రభావం

శ్రీరామనవమికి కనిపించని హడావిడి .. లాక్ డౌన్ ప్రభావం

అలాంటిది ఈ సారి ఆ హడావిడి లేదు . కరోనా ప్రభావంతో సామాజిక దూరం పాటించాలని చెప్తున్న నేపధ్యంలో ఎవరికి వారు ఇళ్లలోనే పూజలకు పరిమితం అయ్యే పరిస్థితి . లాక్ డౌన్ తో బయటకు రాలేని స్థితి . ఇక స్వామి వారి కళ్యాణం చూడాలి అన్నా కేవలం టీవీలలోనే చూడాల్సిన పరిస్థితి . తెలంగాణలో భద్రాచలంలో రాముల వారి కళ్యాణం ఎలా నిర్వహిస్తారో చెప్పక్కర్లేదు. చూసేందుకు రెండు కళ్ళు చాలవు . అంత ఘనంగా స్వామి కళ్యాణం నిర్వహిస్తారు . భద్రాచలంలో స్వామి వారి కళ్యాణం జరిగిన తరువాతే రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణం నిర్వహిస్తారు . ఇక అటు ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు.

అయోధ్యలోనూ అట్టహాసంగా కళ్యాణానికి ప్లాన్ .. కరోనాతో బ్రేక్

అయోధ్యలోనూ అట్టహాసంగా కళ్యాణానికి ప్లాన్ .. కరోనాతో బ్రేక్

అయితే, గత ఏడాది అయోధ్య వివాదంలో తీర్పు రామ జన్మ భూమిగా వచ్చిన కారణంగా ఈ ఏడాది అయోధ్యలో పెద్ద ఎత్తున రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని జరపాలని అనుకున్నారు. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితి . ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని , ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టటానికి అందరూ పోరాటం చెయ్యాలని ఇళ్లకే పరిమితం అయ్యి సామాజిక దూరం , వ్యక్తిగత శుభ్రత పాటించటమే ధ్యేయం అని చెప్తున్న పరిస్థితుల్లో రాములోరి కళ్యాణం గురించి ఎవరూ బయటకు రాలేకపోతున్నారు . ఇక దేవాలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.

Recommended Video

Kodali Nani Slams Chandrababu Naidu And Yellow Media
ఇళ్లకే పరిమితమై రాములోరి కళ్యాణం టీవీల్లో చూసి తరించండి

ఇళ్లకే పరిమితమై రాములోరి కళ్యాణం టీవీల్లో చూసి తరించండి

చివరికి కన్నుల పండుగగా జరిగే భద్రాచలం దేవాలయంలో రాముల వారి కళ్యాణానికి కూడా భక్తులకు అనుమతి లేదు . భద్రాచలం దేవాలయంలో నిర్వహించే శ్రీసీతారాముల కళ్యాణాన్ని లైవ్ ద్వారా టీవీలో ప్రసారం చేయబోతున్నారు. ఇక స్వామి వారి కళ్యాణాన్ని టీవీలలో చూసి తరించాల్సిందే . కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కావాల్సిన ధైర్యం ఇవ్వాలని రాములవారిని కోరుకుంటూ పూజలు , పునస్కారాలు కూడా ఇళ్ళ వరకే పరిమితం . ఏది ఏమైనా కష్ట కాలంలో చాలా సహనంతో పోరాటం చేసిన రాముల వారిని ఆదర్శంగా తీసుకుని కరోనా మహమ్మారి తరుముతున్న నేటి కష్ట కాలంలో సహనంతో సామాజిక దూరం పాటిస్తూ , స్వీయ నిర్బంధమే శ్రీరామ రక్షగా భావిస్తూ శ్రీరామనవమి జరుపుకుందాం .

English summary
In the context of the claim that social distance is to be exercised under the effect of corona, it is a situation in which they are restricted to worship lord sri ram at home on the special occasion of sri rama navami . A condition that cannot come out with a lockdown. just needs to watch Swami's wedding in TVs. In Telangana, Bhadrachalam sri seetha rama marriage is also going to be aired live on TVs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X