హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్ : కేంద్రం ఆదేశాలతో తెలంగాణా రాజ్ భవన్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

చైనాలో కంట్రోల్ లోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. తీరని ప్రాణ, ఆర్ధిక నష్టాన్ని మిగులుస్తుంది. ఇక భారతదేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది . ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాలలో కూడా కరోనా కేసులు నమోదు కావటంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో మొన్న ఒక కేసు నమోదు కాగా , తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది .

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అప్రమత్తమైన కేంద్రం .. రాష్ట్రాలకు ఆదేశాలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అప్రమత్తమైన కేంద్రం .. రాష్ట్రాలకు ఆదేశాలు

కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చెయ్యటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఇక కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తెలంగాణ రాజ్ భవన్‌ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇంకా చాలామందికి వైరస్ లక్షణాలు కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాటిని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సి వస్తుంది .

తెలంగాణా గవర్నర్ కార్యక్రమాలు వాయిదా

తెలంగాణా గవర్నర్ కార్యక్రమాలు వాయిదా

ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు సంబంధించి రాజ్‌భవన్ వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక రాజ్ భవన్ లో గవర్నర్ సందర్శన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోనున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం గవర్నర్‌కి సంబంధిచించిన కార్యక్రమాలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణా రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నారు.

కేంద్రం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్న రాజ్ భవన్ వర్గాలు

కేంద్రం ఆదేశాలతో నిర్ణయం తీసుకున్న రాజ్ భవన్ వర్గాలు

ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు సమూహాలుగా ఉండొద్దని, బయట ఎక్కువగా తిరగరాదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది . దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్‌భవన్ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ కార్యక్రమాలు రద్దు చేసిన రాజ్ భవన్ వర్గాలు తిరిగి గవర్నర్ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయో ప్రస్తుతం చెప్పలేదు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాలకనుగుణంగానే తేదీలను నిర్ణయిస్తారని తెలుస్తుంది .

English summary
Rajbhavan sources have made a major decision regarding Telangana Governor Tamili Sai Suondara Rajan under the influence of corona virus. Governor Tamilisai Soundararajan has announced the postponement of all programs. The governor's visit to Raj Bhavan will also be taken care of. Telangana Raj Bhavan sources said that the programs of the governor were postponed as per the directives issued by the Union Health and Family Welfare Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X