నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆటోలో కరోనా రోగి మృతదేహం, డ్రైవర్, పక్కనున్న వ్యక్తికి నో పీపీఈ కిట్..

|
Google Oneindia TeluguNews

కరోనా పేరు చెబితే చాలు ఒళ్లు జలదరిస్తోంది. వైరస్ సోకి చనిపోయిన వారి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది తరలించాలి. వారు విధిగా పీపీఈ కిట్లు ధరించి.. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని.. అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ నిజామాబాద్ జిల్లాలో ఒకరు ఆటోలో కరోనా వైరస్‌తో చనిపోయిన మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఆ ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఆ ఫోటో చూడగా భయాందోళన కలిగిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా.. మృతదేహం ఎలా తరలిస్తారనే విమర్శలు వస్తున్నాయి.

కరోనా వైరస్ సోకి చనిపోతే తప్పకుండా మృతేహాన్ని అంబులెన్స్‌లో తరలించాలి. లేదంటే ఎస్కార్ట్ వాహనంలో తీసుకెళ్లాలి. ఆ సమయంలో వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు తప్పకుండా ధరించాలి.. కానీ నిజామాబాద్ సర్కార్ దవాఖానలో చనిపోయిన రోగి మృతదేహన్ని తరలించేందుకు సమయానికి అంబులెన్స్ లేదట. అందుకే ఆటోలో కరోనా వైరస్‌తో చనిపోయిన మృతదేహాన్ని తరలించారు.

corona patient dead body moved in auto..

Recommended Video

COVID-19 Vaccine In 2021 - Itolizumab Injection For Severe Corona Cases || Oneindia Telugu

ఆస్పత్రి వద్ద అంబులెన్స్ లేకపోవడంతోనే ఆటోలో తీసుకొచ్చామని బంధువులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్దమైన తప్పలేదు అని చెబుతున్నారు. అయితే ఆటోలో ఉన్న డ్రైవర్, మరో వ్యక్తి కూడా పీపీఈ కిట్లు ధరించలేదు. దీంతో మరింత భయాందోళన నెలకొంది. శుక్రవారం రాష్ట్రంలో 8 మంది చనిపోగా.. నలుగురు నిజామాబాద్‌కే చెందినవారు అని తెలుస్తోంది.

English summary
bizarre incident at nizamabad district. corona patient dead body moved in auto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X