హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా పేషంట్ మాయం: వైరస్ నిర్ధారించాక కనిపించని వృద్దుడు, 13 మంది హోం క్వారంటైన్...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేల మార్క్ దాటింది. ఇటీవల పాజిటివ్ కేసుల సంఖ్య 100 మార్క్ దాటుతోంది. దీంతో భయాందోళన నెలకొంది. అయితే కరోనా వైరస్ సోకిన ఓ వృద్దుడు.. ఆస్పత్రిలో మాత్రం కనిపించడం లేదు. దీంతో సిబ్బంది, అధికారులు హైరానా పడుతున్నారు.

హైదరాబాద్‌లో కరోనా వైరస్ విస్పోటనం.. పెరిగిన మరణాలు.. తెలంగాణలో తాజా లెక్కలివి..హైదరాబాద్‌లో కరోనా వైరస్ విస్పోటనం.. పెరిగిన మరణాలు.. తెలంగాణలో తాజా లెక్కలివి..

కామారెడ్డి పంచముఖి హనుమాన్ కాలనీలో 60 ఏళ్ల వృద్దుడు ఉంటున్నాడు. ఇతనికీ వైరస్ సోకిందని స్థానికులు సమాచారం ఇచ్చారు. వెంటనే వైద్యులు, పోలీసులు కాలనీలో సర్వే చేపట్టారు. ఆ వృద్దుడు హైదరాబాద్‌లో పరీక్షలు చేయించుకున్నారు. కరోనా సోకిందని బుధవారం రాత్రి వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కానీ తర్వాత వృద్దుడు సిటీలో కనిపించడం లేదు. దీంతో కామారెడ్డి అధికారులకు సమాచారం అందజేశారు.

corona patient run away from hospital..

కామారెడ్డిలో కూడా లేకపోవడంతో ఎక్కడికీ వెళ్లాడనే అంశంపై స్పష్టత లేదు. ముందుజాగ్రత్త చర్యగా.. వృద్దుడి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. 13 మంది ఇంటిలోనే ఉంచి.. వైరస్ నివారణ చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు వృద్దుడి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కూడా ఆరాతీస్తున్నారు. అతనికి వైరస్ ఎలా సోకిందనే అంశంపై మాత్రం స్పష్టత రాలేదు.

English summary
corona patient run away from hospital to somewhere. 13 family members are home quarantined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X