వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో కరోనా బాధితుల డైట్ లో మార్పులు ... మరింత బలవర్ధకంగా .. మెనూ ఇదే

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ప్రభుత్వం కరోనా వైరస్ తో బాధ పడుతున్నవారికి చికిత్సతో పాటు సరైన పౌష్టిక ఆహారం కూడా ఇస్తున్న విషయం తెలిసిందే .కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటే ఒక్క మందులు మాత్రమే సరిపోవు. పౌష్టికాహారం కూడా ముఖ్యమే కాబట్టి ఇప్పటివరకు రోగులకు వారు కోరుకున్న విధంగా పలు పోషకాలతో కూడిన డైట్ అందించిన తెలంగాణా ప్రభుత్వం మెనూలో మార్పులు చేసింది . తెలంగాణా రాష్ట్రంలో కరోనా బాధితులకు వైద్యసేవలు అందటం లేదని, సరైన ఆహారం ఇవ్వటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలోప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది .

టీటీడీలో కరోనా టెన్షన్.. 10 మందికి పాజిటివ్.. రేపు బోర్డు అత్యవసర సమావేశంటీటీడీలో కరోనా టెన్షన్.. 10 మందికి పాజిటివ్.. రేపు బోర్డు అత్యవసర సమావేశం

కరోనా బాధితులకు పోషకాలతో కూడిన ఆహారాన్నిఅందించాలని, కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణా ప్రభుత్వం మరోసారి సీరియస్‌గా ఆదేశించింది. దీంతో మరోమారు మెనూ మారింది. కరోనా పేషెంట్లకు అందిస్తున్న డైట్‌ను మార్చిన అధికారులు ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డిస్పోజబుల్ పాత్రల్లో మాత్రమే అందించాలని నిర్ణయం తీసుకున్నారు .

corona patients diet menu Changes in Telangana ...this is the menu

ఇక మెనూ చూస్తే ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల మధ్య బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, బోండా, ఉప్మా, పూరి, ఊతప్పంలలో ఏదో ఒక దాన్ని ఇస్తారు. దానితోపాటు పాలు కూడా ఇస్తారు. ఉదయం 10 గంటలకు బిస్కెట్లతో పాటు టీ లేదా కాఫీ ఇస్తారు. ఇక మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల మధ్య భోజనంలో అన్నంతో పాటుగా పప్పు, కోడిగుడ్డు, కూర, సాంబారు, పెరుగు, అరటిపండు, మినరల్ వాటర్ అందిస్తారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటలలోపు స్నాక్స్ తో పాటుగా కాఫీ లేదా టీ ఇస్తారు.వీటితో పాటు ఖర్జూరం, బాదం పప్పు, అంజీర కూడా ఇస్తారు. ఇక రాత్రి డిన్నర్ లో అన్నంతో పాటు కూర, కోడిగుడ్డు, పప్పు, సాంబార్, పెరుగు, అరటిపండు, మినరల్ వాటర్ అందిస్తారు.ఈ మెనూనే పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా ఇస్తామని అధికారులు వెల్లడించారు.

English summary
The Telangana government has once again ordered the Telangana government to provide nutritious food to the corona sufferers and take special care of the health of the corona patients. Officials who changed the diet for Corona Patients decided to serve only nutritious food in disposable containers, from morning tiffin to dinner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X