హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓల్డ్ సిటీలో కరోనా టెన్షన్ .. వారం క్రితం మటన్ పంచిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 766కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది. కానీ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది . ఇక కరోనా కేసులు బాగా పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా ఓల్డ్ సిటీలో ఒక లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్ అని తేలటంతో ఓల్డ్ సిటీ వాసులు టెన్షన్ పడుతున్నారు.

తెలంగాణా ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా సరే కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇది తెలంగాణా సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తుంది . ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఏదో విధంగా ఎటాక్ అవుతూనే ఉన్నది. ఇక తాజాగా ఓల్డ్ సిటీలో ఒక లారీ డ్రైవర్ కు కరోనా రావటంతో చాలా మంది భయపడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు . ఈ లారీ డ్రైవర్ వారం రోజుల క్రితం అక్కడి వ్యక్తులకు మటన్ పంచిపెట్టాడని సమాచారం . ఆ తరువాత లారీ డ్రైవర్ కు టెస్ట్ చేయగా, కరోనా పాజిటివ్ అని తేలింది.

Corona positive for lorry driver in Old City who distributed mutton a week ago

దీంతో ఓల్డ్ సిటీ అప్రమత్తం అయ్యింది. లారీ డ్రైవర్ పంచిపెట్టిన మటన్ ను తిన్నవాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కరోనా వచ్చిందేమో అని భయపడుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని టెస్టులు చేయించుకోవాలని అధికారులు చెప్తున్నారు.ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపధ్యంలో లారీ డ్రైవర్ మటన్ పంచిపెట్టటం అతనికి కరోనా పాజిటివ్ అని తేలటం పాతబస్తీ వాసులను షాక్ కు గురి చేస్తుంది . ఇక అతనికి కాంటాక్ట్ లో ఉన్న వారు ఎవరు అనేది కూడా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.

English summary
The Telangana government has been steadfastly implementing a lock-down, but cases are increasing. This is worrying the Telangana Sarkar. No matter how careful the corona is, somehow it continues to attack. Many people are worried about the recent case of a lorry driver in the Old City. It is reported that the driver distributed the mutton to the people a week ago. The truck driver was later tested Corona positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X