వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా రిలీఫ్ ఫండ్ : టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దీంతో ఈ వైరస్‌ని ఎదుర్కోడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుం బిగించారు.

Recommended Video

TRS Leaders Donating 500 Crore To CM Relief Fund!
టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల రూ.500 కోట్ల రూపాయల విరాళం

టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల రూ.500 కోట్ల రూపాయల విరాళం

ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా సహాయ నిధికి తమకు తోచిన సహాయాన్ని అందిస్తే టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం, ఒక ఏడాది నియోజక వర్గ అభివృద్ధికి నిధులు మొత్తం కలిపి దాదాపు రూ.500 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు.

ఎంపీలు నియోజకవర్గ గ్రాంట్స్ ను కూడా కరోనా రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ప్రకటన

ఎంపీలు నియోజకవర్గ గ్రాంట్స్ ను కూడా కరోనా రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ప్రకటన

ఎంపీలు మొత్తం తమ గ్రాంట్స్ ను దాదాపు 80 కోట్ల రూపాయలను కరోనా సహాయ నిధి కోసం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఎంపీ ఏడాదికి ఐదు కోట్ల రూపాయలను తమ నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలకు మొత్తం 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి డొనేట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏడాది పాటు నియోజకవర్గ నిధులకు కరోనా రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఏడాది పాటు నియోజకవర్గ నిధులకు కరోనా రిలీఫ్ ఫండ్ కు ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఉప నాయకుడు బండ ప్రకాష్ లు తమ నిర్ణయాన్ని కేసీఆర్ కు తెలియజేశారు. అంతేకాదు లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వర రావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు లెటర్‌ను అందించారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తన ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వారికి ఏడాదికి విడుదలయ్యే నిధులను కూడా సీఎం సహాయ నిధికి డొనేట్ చేయనున్నట్లు టీఆర్ఎస్ శాసన సభా పక్షం ప్రకటించింది.

ప్రజా ప్రతినిధుల స్పందనకు అభినందించిన కేసీఆర్

ప్రజా ప్రతినిధుల స్పందనకు అభినందించిన కేసీఆర్


కరోనా వ్యాప్తి నివారణ కోసం చేపట్టే కార్యక్రమాలకు ఈ నిధులను వాడాలని వారు సీఎం కేసీఆర్ ను కోరారు. అయితే కష్ట కాలంలో ప్రజల ప్రాణాలను రక్షించటానికి ఇంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించిన నేతలను సీఎం కేసీఆర్ అభినందించారు. చట్టసభ సభ్యులు చూపించిన స్ఫూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహం ఇస్తుందన్నారు. ఇక రాష్ట్రానికి మాత్రమే కాకుండా రాజ్యసభ, లోక్‌ సభ సభ్యులు మరో నెల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి అందిస్తామని ప్రకటించారు.

English summary
Already, many prominent politicians have given their support to the Corona relief Fund, while ministers, MPs, MLAs and MLCs of the TRS have also decided to help the CM Relief Fund. They have come forward to donate nearly Rs 500 crore to the CM Relief Fund, including a month's wages and a year's worth of fund development for the constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X