• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా పంచాయితీలు ... బాయ్ ఫ్రెండ్ ను కలవాలి ..అనుమతి కోరిన యువతి

|

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పోలీసులకు చిత్ర విచిత్రమైన కేసులు వస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా ప్రభావం తో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ప్రభావంతో ఇళ్ళలో భార్య, భర్తలే కాదు , ప్రేమికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక ఒకరి కోసం ఒకరు కలవటానికి చేస్తున్న ప్రయత్నాలు పోలీసులకు విస్మయాన్ని కలిగిస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్ .. ఏపీ స్కూల్స్ జూన్ 11 వరకు క్లోజ్ ? తర్జనభర్జనల్లో సర్కార్

 లాక్ డౌన్ సమయంలో ప్రజల వింత సమస్యలు

లాక్ డౌన్ సమయంలో ప్రజల వింత సమస్యలు

లాక్ డౌన్ సమయంలో ప్రజలు బయటకు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు . దీంతో చాలా మందికి ఇది ఇబ్బందిగా మారింది. నిన్నటికి నిన్న ఒకడు కేరళ లో పిల్లుల ఆహారం కోసం బయటికెళ్లడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ కోర్టుకెక్కి రచ్చ చేశాడు . ఇక మొన్నామధ్య ఏకంగా ఇంట్లో పెళ్ళాంతో పడలేకపోతున్నా అని లాక్ డౌన్ తో తిప్పలు వర్ణనాతీతంగా మారాయని ఏకంగా కేటీఆర్ కే ట్వీట్ చేశారు .ఇక మంచి సినిమాలు కనీసం టీవీల్లో అయినా వేయించాలని కేటీఆర్ ను కోరారు.

ప్రేమికుడిని కలవాలంటూ పోలిస్ స్టేషన్ కు వెళ్ళిన యువతి

ప్రేమికుడిని కలవాలంటూ పోలిస్ స్టేషన్ కు వెళ్ళిన యువతి

ఇక తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న సంఘటన ప్రేమికుల తిప్పలను కళ్ళకు కడుతుంది . హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ కావాలంటూ కోరింది. ఏకంగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళి మరీ అనుమతి ఇవ్వాలని అడగటంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. ఇక అంతకు ముందు రోజే ఆ యువకుడు ఆ అమ్మాయిని చూడాలని ఆమె ఇంటి దగ్గరికి వచ్చాడు .దీంతో ఆ అమ్మాయి తల్లి తండ్రులు తమ కూతురును వేధిస్తున్నాడని కేసు పెట్టారు.

స్టేషన్ ముందు కూర్చుని హంగామా ... యువతికి నచ్చజెప్పిన పోలీసులు

స్టేషన్ ముందు కూర్చుని హంగామా ... యువతికి నచ్చజెప్పిన పోలీసులు

పోలీసులు విచారించగా అతను ఆ సమయానికి తప్పించుకోటానికి ఏదేదో చెప్పాడు . ఆ అమ్మాయిని ప్రేమించట్లేదని అది చెప్పడానికే ఇంటికి వచ్చానని తెలిపాడు. ఇక ఈ విషయం తెలిసిన అమ్మాయి షాక్ తింది. ఇప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటూ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. దాంతో పోలీసులు ఆ యువతికి నచ్చ జెప్పి ఇంటికి పంపించారు. ఒక పక్క కరోనా విధులతో సతమతం అవుతుంటే అర్ధం పర్ధం లేని పంచాయితీలు పోలీసులను ఇబ్బంది పెడుతున్నాయి.

English summary
The latest incident in Hyderabad catches the eye of lovers. At Banjarahills Police Station in Hyderabad, a young woman asked for permission to meet her boyfriend. She went to the police station and ask for permission, the police did not know what to do. finally they onined her send her to home .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more