వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా టైమ్.. విధుల్లో ఉన్న సిబ్బందికి జీతాలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా : తెలంగాణా సర్కార్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుని ఉద్యోగుల, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధించిన మాట తెలిసిందే . అయితే ఊహించని విధంగా కరోనా పోరాటంలో, అలాగే లాక్ డౌన్ సక్సెస్ కావటంలో తీవ్రంగా కృషి చేస్తున్న వారి పూర్తి జీతాలను చెల్లించటమే కాదు వారికి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని కరోనా పై పోరాటం సాగిస్తున్న ఉద్యోగులకు బూస్ట్ ఇచ్చింది .

ఊహించని విపత్తు .. కరోనా , లాక్ డౌన్ గుర్తుగా పిల్లలకు పేర్లు పెట్టేస్తున్న ప్రజలుఊహించని విపత్తు .. కరోనా , లాక్ డౌన్ గుర్తుగా పిల్లలకు పేర్లు పెట్టేస్తున్న ప్రజలు

 ఉద్యోగుల,ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించిన సర్కార్

ఉద్యోగుల,ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించిన సర్కార్

కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో ప్రభుత్వం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. అందుకే ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధించిన సర్కార్ నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించింది. సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో 75 శాతం ఆలిండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు చేస్తున్న వారి జీతాల్లో 60 శాతం కోత విధించింది.

 కరోనా సమయంలో సేవలందిస్తున్న వారికి జీతాలతోపాటు ఇన్సెంటివ్స్ కూడా

కరోనా సమయంలో సేవలందిస్తున్న వారికి జీతాలతోపాటు ఇన్సెంటివ్స్ కూడా

ఉద్యోగుల, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించిన సర్కార్ కరోనా పై పోరాటంలో తమ కుటుంబాలను వదిలిపెట్టి, ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా పని చేస్తున్న వైద్యుల, మునిసిపల్ సిబ్బంది, మరియు పోలీసుల జీతాల్లో మాత్రం కోత విధించటం లేదు . అంతే కాదు వారు చేస్తున్న సేవలకు గాను ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనాన్ని చెల్లించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వారు కరోనా వంటి భయంకర మహమ్మారిని ప్రజలకు వ్యాప్తి చెందకుండా కాపాడుతున్న క్రమంలో ఈ శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహకాలు కూడా అందించాలని నిర్ణయించారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
 వైద్యులు, మునిసిపల్ , పోలీసు సిబ్బందికి వేతనాల కోత నుండి మినహాయింపు

వైద్యులు, మునిసిపల్ , పోలీసు సిబ్బందికి వేతనాల కోత నుండి మినహాయింపు

అయితే ఈ ఇన్సెంటీవ్స్‌ ఎంత శాతం ఇవ్వాలనేది ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు . ఇప్పటికే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన తెలంగాణా ప్రభుత్వం మార్చి నెల జీతంలో సగం జీతాన్ని ఇప్పుడు ఇవ్వనుంది. మిగతాది తర్వాత ఇవ్వనున్నారు. అయితే ఈ లిస్టు లో కరోనా సమయంలో సేవలందిస్తున్న వైద్యులు, మునిసిపల్ , పోలీసు సిబ్బందికి మినహాయింపు ఇచ్చింది . దీంతో ఈ లిస్టులో.. పోలీసులు, డాక్టర్లు ఉండరని.. వారికి ప్రత్యేకంగా జీతాలిస్తామని వెల్లడించింది తెలంగాణా ప్రభుత్వం . ఇది ఒక మంచి నిర్ణయం అనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తం అవుతుంది.

English summary
Telangana CM KCR decided to pay full salary in March to medical, health and police personnel who are working hard to prevent the spread of coronavirus. They also decided to provide additional cash incentives to employees of these departments in order to protect the pestilence like Corona from spreading to the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X