వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో కరోనా రికార్డ్ బ్రేక్ .. హైకోర్టు మండిపడినా,ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నామారని సర్కార్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది కానీ ప్రభుత్వం కరోనా కట్టడిలో తీవ్రంగా విఫలమవుతోంది. ఇప్పటికీ సీఎం కేసీఆర్ కరోనాపై ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో ఉన్నారు. కరోనా పరీక్షల నిర్వహణ సైతం రోజురోజుకు గందరగోళంగా మారుతుంది. హైకోర్టు విచారణలో కరోనా నియంత్రణా చర్యల విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరుగుతున్నా ,టెస్టులు చేయలేమని చేతులెత్తేస్తున్న ప్రభుత్వ తీరు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.

దేశవ్యాప్తంగా మార్కెట్ లో పతంజలి కరోనిల్ కిట్ .. ఎలాంటి ఆంక్షలు లేవన్న రాందేవ్ బాబాదేశవ్యాప్తంగా మార్కెట్ లో పతంజలి కరోనిల్ కిట్ .. ఎలాంటి ఆంక్షలు లేవన్న రాందేవ్ బాబా

ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలు నిలిపివేయాలని ఆదేశాలు

ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలు నిలిపివేయాలని ఆదేశాలు

మొన్నటికి మొన్న హైకోర్టు ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యవహారాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసినా సరే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా వ్యవహారంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒక్కరోజులోనే ప్రైవేట్ ల్యాబ్ లలో పరీక్షలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబ్ లలో వైద్య ఆరోగ్య శాఖ జరిపిన పరీక్షల్లో లోపాలు బయటపడ్డాయని ఈ వాటన్నింటిని నాలుగు రోజుల్లో సరిచేసి, ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ లు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది .

 టెస్టుల విషయంలో ఏపీతో వెనకబడిన తెలంగాణా

టెస్టుల విషయంలో ఏపీతో వెనకబడిన తెలంగాణా

చీటికి మాటికి ల్యాబ్ లలో టెస్ట్ లను నిలిపివేయడంతో తెలంగాణలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. పక్క తెలుగు రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. జంటనగరాల్లో మొత్తం 11 ఆస్పత్రుల్లో కరోనా టెస్టింగ్ సెంటర్లు ఉండగా , టెస్టింగ్ సామర్థ్యం చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం బయటపడుతున్న కేసులు తక్కువ టెస్టులకు బయట పడుతూ ఉండడం గమనించాల్సిన అంశం. ఇంకా ఎక్కువగా టెస్ట్ లు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా కేసులు ఉంటాయి అని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.

కొద్దిపాటి శ్యాంపిల్స్ కే పెద్ద ఎత్తున కేసులు

కొద్దిపాటి శ్యాంపిల్స్ కే పెద్ద ఎత్తున కేసులు

కొద్దిపాటి శాంపిల్ లతోనే పెద్దఎత్తున కేసులు నమోదు అవుతున్న తరుణంలో,కరోనా టెస్టుల సామర్ధ్యాన్ని పెంచితే తెలంగాణ రాష్ట్రం కరోనాతో ఎంతగా ఎఫెక్ట్ అయిందో అర్థం అవుతుందనే భావన కలుగుతుంది. రాష్ట్రంలో కరోనా టెస్టుల సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో ప్రభుత్వం బాగా విఫలమవుతుంది . పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునట్లుగా కనిపిస్తుంది. భయంకరంగా కరోనా కేసులు పెరుగుతున్నా నియంత్రణ విషయంలో మాత్రం చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేని విధంగా ఇప్పటి ముబ్బడిగా కేసులు పెరుగుతున్నాయి .

 ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా పట్టింపేది?

ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా పట్టింపేది?

ఒకపక్క బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీ కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని , టెస్టుల సామర్ధ్యాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతుంది . నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండేలా కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ నేతలు సైతం కరోనా ఫండ్స్ లెక్కలు అడుగుతున్నారు. నిధులు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు . ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు .

రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులతో తెలంగాణా విలవిల

Recommended Video

Ravikumar మరణం పై స్పందించిన Chest Hospital వర్గాలు! || Oneindia Telugu
ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి

రోజురోజుకు పెరుగుతున్న కేసులతో జననం భయాందోళన నెలకొంది.తాజాగా రికార్డు స్థాయిలో నమోదైన కేసులు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితి అని చెప్పకనే చెబుతుంది. గడచిన 24 గంటల్లో 5356 శాంపిల్స్ పరీక్షించగా 1213 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి అంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18570 కి పెరిగింది. హైదరాబాద్ లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉంటే ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై తీవ్ర అసహనంతో ఉన్నారు.

English summary
Corona is terrifing Telangana state but the government is failing badly in corona control. The CM still does not understand what to do he is in a dilemma. Corona tests management can become confusing day by day. At the High Court hearing, ignited the government's decision on regulatory actions. Telangana state is facing day-to-day cases and the government's decision to not do the tests is questioning the integrity of the government in Telangana state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X