వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్య నాదెళ్ల భార్య అనుపమ రూ.2కోట్లు.. ఉద్యోగ సంఘాలు భారీగా రూ.48 కోట్లు..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు మద్దతిస్తూ, వైద్య సదుపాయాల కల్పన కోసం తమ వంతు సాయంగా దాదాలు విరాళాలు ప్రకటిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటికే మహింద్రా, రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు కరోనాపై పోరుకు పెద్ద మొత్తాన్ని ఖర్చుచేయనుండగా, ప్రముఖ వ్యక్తులు, పలు ఉద్యోగ సంఘాలు సైతం ముందుకొచ్చాయి.

కేసీఆర్‌తో అనుపమ తండ్రి

కేసీఆర్‌తో అనుపమ తండ్రి


హైదరాబాద్ లో పుట్టిపెరిగి, ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు సీఈవోగా కొనసాగుతోన్నారు సత్య నాదెళ్ల. ఆయన భార్య అనుపమకు కూడా హైదరాబాద్ తో విడదీయలేని అనుబంధం. సత్య, అనుపమ తండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులు కావడం గమనార్హం. కరోనా వ్యాప్తిని కట్టడంచేయడంతోపాటు అదే సమయంలో పేదల నిత్యావసర సరుకుల సరఫరా కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సహాయంగా అనుపమ రూ.2కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఆమె తండ్రి, విశ్రాంత ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కు చెక్కును అందజేశారు.

ఒక రోజు జీతం రూ.48 కోట్లు

ఒక రోజు జీతం రూ.48 కోట్లు

కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయకారిగా నిలవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్, అధికారులు, పెన్షనర్లు, కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు వారంతా తమ ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆయా సంఘాల తరఫున జేఏసీ ప్రతినిధులు కారం రవీందర్ రెడ్డి, మమత తదితరులు మంగళవారం కేసీఆర్ ను కలిసి రూ. 48 వేల చెక్కును అందజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీ సర్కారుకు కూడా..

ఏపీ సర్కారుకు కూడా..


తెలంగాణ ఉద్యోగ సంఘాలు, అనుపమ నాదెళ్లతోపాటు హీరో నితిన్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. హాస్యనటుడు, వైసీపీ నేత అలీ రెండు ప్రభుత్వాలకూ చెరో లక్ష వితరణ చేశారు. రాబోయే రోజుల్లో దాతల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మంగళవారం నాటికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36కు పెరగగా, ఏపీ వ్యాప్తంగా ఏడు కేసులు మాత్రమే వెలుగు చూశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడగా, జనం ఇళ్లకే పరిమితమైపోయారు.

English summary
Anupama Nadella, wife of Microsoft CEO Satya Nadella donates Rs 2 crore to Telangana govt for the efforts to stop #Coronavirus spread. employees and teachers gave a day’s basic salary i.e Rs.48 crore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X