కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus: సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా, ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి వరకు 19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించాయి. అయితే ఇటీవల కరీంనగర్‌కు ఇండోనేషియా ప్రతినిధి బృందం రావడంతో అక్కడ భయాందోళన నెలకొంది. ఎనిమిది మంది పాజిటివ్ సోకడంతో కలెక్టరేట్ పరిధిలో గల 3 కిలోమీటర్ల వరకు వైద్య బృందాలు ఇళ్లలోకి వెళ్లి మరీ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని స్వయంగా పరిశీలిద్దామని సీఎం కేసీఆర్ అనుకొన్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన శనివారం పర్యటన వాయిదా పడింది.

కరీంనగర్ సహా రాష్ట్రంలోని ప్రజల్లో నింపేందుకు సీఎం కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటిద్దామని అనుకొన్నారు. కానీ సీఎం పర్యటన వల్ల స్క్రీనింగ్, పరీక్షలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కరీంనగర్‌లో పరిస్థితిపై నిత్యం కలెక్టర్, పోలీసు కమిషనర్లతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సీఎం పర్యటన వల్ల అక్కడ చేపడుతోన్న పరీక్షలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్, సీపీ సహా, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

coronavirus: cm kcr karimnagar visit postponed

Recommended Video

PM Modi Telugu Speech On Coronavirus | 'Janata Curfew' Why Only One Day ? | Oneindia Telugu

తన పర్యటన వల్ల ఇబ్బంది కలుగుతోందని.. వైద్యబృందం విధులకు ఆటంకం కలుగొద్దని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు కరీంనగర్‌లో పరిస్థితి బాగుందని.. అక్కడ జరుగుతోన్న ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ భరోసా ఇవ్వడంతో కేసీఆర్ మిన్నకుండిపోయారు. సీఎం పర్యటనను విరమించుకున్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి.

English summary
telangana cm kcr karimnagar visit postponed due to inconvenience to health team work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X