హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షూట్ ఎట్ సైట్ పరిస్థితి తెచ్చుకోవద్దు: కేసీఆర్ స్ట్రాంట్ వార్నింగ్, ఎమర్జెన్సీ ఐతే 100కు కాల్ చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఎవరికీ సీరియస్ గా లేదని, వారంత కోలుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందననారు.

షూట్ ఎట్ సైట్ పరిస్థితి వద్దు..

షూట్ ఎట్ సైట్ పరిస్థితి వద్దు..

ప్రపంచంలో కరోనా సోకని దేశమే లేదని కేసీఆర్ అన్నారు. విదేశీయుల వల్లే మకరోనా వచ్చిందని, వారు తిరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 114 మంది అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మనమందరం అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. ప్రజలు సహకరించకపోతే 24 గంటలపాటు కర్ఫ్యూ పెట్టాల్సి వస్తోందన్నారు. అంతేగాక, షూట్ ఎట్ సైట్ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. నిర్మల్‌లో క్వారంటైన్ నుంచి ఓ యువకుడు మూడుసార్లు పారిపోయాడని చెప్పారు.

ప్రజాప్రతినిధులంతా రంగంలో దూకాలి.. పోలీసులేనా?

ప్రజాప్రతినిధులంతా రంగంలో దూకాలి.. పోలీసులేనా?

రోడ్లపై ప్రజలను కంట్రోల్ చేస్తూ పోలీసులు, కలెక్టర్లు, అధికారులు కనిపిస్తున్నారని.. ప్రజాప్రతినిధులు ఏమయ్యారని కేసీఆర్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ 150 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. జంట నగరాలు, మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగాలని అన్నారు. 150 కార్పొరేటర్లు ప్రజల ఆస్తి అని, వారంతా రంగంలోకి దూకాలన్నారు. ఆపత్కాల సమయంలో ప్రజల మధ్య ఉండాలని, ప్రజల కోసం పనిచచేయాలని అన్నారు. మంత్రులు వారి జిల్లాల హెడ్ క్వార్టర్లకు పోయి ఉండాలని.. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండి.. అధికారులతో సమన్యం చేయాలన్నారు. లీడ్ రోడ్ పోషించాలన్నారు. హెల్త్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ మాత్రం నగరంలోనే ఉంటూ అన్ని చూసుకుంటారన్నారు. మిగితా మంత్రులు మాత్రం వారి జిల్లాలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఉండాలన్నారు. ఒక్క పోలీసులతోనే అంతా సాధ్యం కాదన్నారు.

కొట్టమని చెప్పడం లేదు కానీ..

కొట్టమని చెప్పడం లేదు కానీ..

గ్రామాల్లో స్టాండింగ్ కమిటీలు వేయించాం.. 8 లక్షల సభ్యులు క్రియాశీలం కావాలి.దండంపెట్టి చెబుతున్న ప్రజలను కాపాడుకోవాలి. ఏ ఊరు సర్పంచ్.. ఆ ఊరు కథానాయకుడు కావాలన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ ఛైర్మన్లు కథానాయకులుగా వ్యవహరించాలన్నారు. సింగిల్ విండో ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు రంగంలోకి దిగాలని సీఎం ఆదేశించారు. పోలీసులతోపాటు ప్రజాప్రతినిధులు పనిచేయాలన్నారు. మున్సిపాలిటీల్లో 2 లక్షల మంది స్టాండింగ్ కమిటీ సభ్యులున్నారని, వారంతా లాఠీ పట్టుకుని ఉండాలని, అయితే కొట్టమని చెప్పడం లేదన్నారు కేసీఆర్. ఇప్పటికే వచ్చి నిలిచిపోయిన లారీలు గమ్యస్థానాలు చేరేందుకు అనుమతిస్తున్నామన్నారు. ఆ లారీలు మళ్లీ రావద్దన్నారు.

ఏ ఎమర్జెన్సీ అయినా 100కు కాల్ చేయండి..

ఏ ఎమర్జెన్సీ అయినా 100కు కాల్ చేయండి..

ప్రజలు ఏదైనా వ్యాధి బారిన పడినా.. ఎవరైనా చనిపోయినా.. ఇలాంటి ఎమర్జెన్సీ సందర్భాల్లో 100కు పోన్ చేసి తెలపాలని, పోలీసులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తారన్నారు. రైతాంగం ఆందోళన చెందాల్సిన పనిలేదని, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పిస్తామని, డబ్బులు బ్యాంకులో వేస్తామన్నారు. రైతులు ఎవరి ఊర్లో వారే అమ్ముకోవాలని, కూపన్లు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. వ్యసాయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. సహకార సంఘాలు కూడా కొనుగోలు చేస్తాయన్నారు. రైతు బంధు కమిటీలు కూడా సహకారం అందించాలన్నారు.

English summary
ప్రపంచంలో కరోనా సోకని దేశమే లేదని కేసీఆర్ అన్నారు. విదేశీయుల వల్లే మకరోనా వచ్చిందని, వారు తిరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 114 మంది అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మనమందరం అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. ప్రజలు సహకరించకపోతే 24 గంటలపాటు కర్ఫ్యూ పెట్టాల్సి వస్తోందన్నారు. అంతేగాక, షూట్ ఎట్ సైట్ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. నిర్మల్‌లో క్వారంటైన్ నుంచి ఓ యువకుడు మూడుసార్లు పారిపోయాడని చెప్పారు. 2
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X